శుక్రవారం జరగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఆదేశించారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అధికారులతో సీఈవో బుద్ధభవన్ నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శశాంక్ గోయల్ తెలిపారు.
పోలింగ్ సందర్భంగా కొవిడ్ నిబంధనలను విధిగా పాటించాలన్న ఆయన... పోలింగ్ కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్లు, కెమెరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఐదు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఆరు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల కోసం 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఈవో తెలిపారు. 5326 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ లేదా వీడియోగ్రఫీ ఉంటుందని చెప్పారు.
కొవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాలి..
ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్‌కాస్టింగ్ లేదా వీడియోగ్రఫీతో మొత్తం పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయాలని అధికారులను ఆదేశించాం. ఓటర్లకు ఓటర్ స్లిప్స్ ఇస్తున్నారు. ఓటరు గుర్తింపు కోసం ఓటరు కార్డు, గుర్తింపు కార్డులు చూపించాలి. దాని కోసం కూడా సూచనలు ఇచ్చాం. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎన్నికల సంఘం ఇచ్చిన పెన్నులనే ఉపయోగించాలి. పోలింగ్ స్టేషన్‌కు ఓటర్లు మొబైల్ ఫోన్లను కానీ, కెమెరాలను తీసుకెళ్లడానికి ఆస్కారం లేదు. దీనిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించాం. కొవిడ్ ప్రోటోకాల్‌ను ప్రతి పోలింగ్ స్టేషన్లో పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించాం. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక మెడికల్ హెల్ప్‌డెస్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులో థర్మల్ స్కానింగ్‌తో పాటు శానిటైజర్, గ్లౌజులు, మాస్క్‌లు లేని వారికి మాస్క్‌లు ఇస్తారు. పోలింగ్ స్టేషన్‌లోని వారు కూడా భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాం. -శశాంక్ గోయల్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
శుక్రవారం పోలింగ్ అనంతరం.. ఈనెల 15న కౌంటింగ్ జరగనుంది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. అందులో ఆరు స్ఖానాలు ఏకగ్రీవమై తెరాస ఖాతాలోకి చేరాయి.
ఇదీ చదవండి: