కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ చాలా నిరుత్సాహ పరిచాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కేంద్ర మంత్రి ప్రకటన ఆచరణకు ఆమడ దూరంలో ఉన్నాయని పేర్కొన్నారు. బ్యాంకులు వాళ్ల సమస్యలతోనే సతమతవువుతు న్నాయని... ఇక ప్రజలకు ఏం చేస్తాయని ప్రశ్నించారు.
ప్యాకేజీ-2 సఫలం అయ్యేలా లేదని వినోద్ అభిప్రాయపడ్డారు. ఈ ప్యాకేజీ ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరం కాదని స్పష్టం చేశారు. నాబార్డు రీ ఫైనాన్స్ స్కీం లు కొత్త సీసాలో పాత సారా చందంగా ఉన్నాయని విమర్శించారు. కాంపా నిధులు ఏ మేరకు సాయ పడతాయన్నారు. కేంద్ర వైఖరి చూస్తుంటే ప్లేయింగ్ టు గ్యాలరీ లాగా ఉందని వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: మధ్యాహ్నం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం..సండలింపులపై ఉత్కంఠ..