రాష్ట్రంలో మరో లక్ష టన్నుల కందుల కొనుగోలుకు కేంద్రం మంగళవారం అనుమతి ఇచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే 51 వేల టన్నులను కేంద్రం కొనుగోలు చేసింది. సీఎం కేసీఆర్ విన్నపం మేరకు అదనంగా మరో లక్ష టన్నులు కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని మంత్రి వెల్లడించారు.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణలో పండిన పంటనంతా కొంటామని వివరించారు.