కేంద్ర బడ్జెట్ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. అయినా ప్రతిపక్ష నేతలెవరూ స్పందించట్లేదని మండిపడ్డారు. అసెంబ్లీ, సచివాలయం భవిషత్య్ అవసరాలకు అనుగుణంగా నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణలో భాజపాతో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సహకారం వల్లే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాల్లో భాజపా గెలిచిందన్నారు.
ఇవీ చూడండి : 'రాష్ట్రంలో 18 లక్షలకు పైగా సభ్యత్వ నమోదే లక్ష్యం'