కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (home minister Amit Shaw) అధ్యక్షతన తిరుపతి వేదికగా జరిగిన దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో (Southern Zonal Council Meeting) రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రతిపాదించిన ఎజెండాలో తెలంగాణకు సంబంధం ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించింది. పాలమూరు-రంగారెడ్డి, (Palamuru-Rangareddy) నక్కలగండి ఎత్తిపోతల పథకాలు ఉమ్మడి ఏపీలోనే ప్రారంభించిన ప్రాజెక్టులని... దిగువ రాష్ట్రాల హక్కులతో చేపట్టిన వీటిపై కర్ణాటకకు అభ్యంతరాలు అక్కర్లేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలవివాదాలను బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ (Brijesh Kumar Tribunal) చూస్తున్నందున రెండు ప్రాజెక్టుల విషయంలో ట్రైబ్యునల్ తీర్పునకు కట్టుబడి ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పాలమూరు - రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టుల డీపీఆర్లు కేంద్ర జలసంఘం ఆమోదం కోసం జనవరి 15లోగా కేఆర్ఎంబీకి (krmb) ఇవ్వాలని కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. సంగంబండ విషయంలో కర్ణాటకకు లేఖ రాశామన్న తెలంగాణ... సంయుక్త సర్వే చేపట్టి ముంపు సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపింది.
సెటిల్మెంట్కు సిద్ధంగా ఉన్నాం..
విద్యుత్ సరఫరా చేసినందుకు తెలంగాణ డిస్కంలు ఏపీకి 3,442 కోట్లు ఇవ్వాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుందామన్న విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఏపీ... ఎన్సీఎల్టీ, కోర్టులను ఆశ్రయించిందని పేర్కొంది. వాస్తవానికి లెక్కలన్నీ తీస్తే ఏపీ నుంచే తమకు విద్యుత్ బకాయిలు 4,457 కోట్లు రావాల్సి ఉందని... ఏపీతో పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ వివరించింది.
కేంద్ర ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం
తెలంగాణ, ఏపీ... చర్చించుకుని విద్యుత్ బకాయిల (Electricity arrears) అంశాన్ని పరిష్కరించుకోవాలని కౌన్సిల్ సూచించింది. దిల్లీలోని ఏపీ భవన్ (ap bawan in Delhi) విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రెండు ప్రతిపాదనలపై గతంలోనే చర్చ జరిగిందన్న తెలంగాణ... కొత్త ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తామని చెప్పింది. తొమ్మిదో షెడ్యూల్ లోని సంస్థల విభజనకు సంబంధించి షీలా బిడే కమిటీ (Sheila Bide Committee) సిఫారసులు.. హెడ్ క్వార్టర్ విషయంలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకలకు విరుద్దంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 68 సంస్థల విభజనకు ఎలాంటి అభ్యంతరం లేదని... 23 సంస్థల విషయంలో ఉన్న అభ్యంతరాలను ఏపీకి తెలిపామని వివరించింది. పదో షెడ్యూల్లోని ఉన్నత విద్యామండలి విభజనకు సంబంధించి సుప్రీంకోర్టు (supreme court) ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర హోంశాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేయాలి
విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ( mulugu tribal university) ఏర్పాటు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమావేశంలో ప్రస్తావించింది. ఇప్పటికే 335 ఎకరాల భూమిని గుర్తించామని, యూత్ ట్రైనింగ్ సెంటర్ లో తాత్కాలిక క్యాంపస్ ను కూడా గుర్తించినట్లు తెలిపింది. గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రం కోరింది.
ఇదీ చూడండి: mahmood ali: 'ఏపీతో విభజన అంశాలను సామరస్యంగా పరిష్కరించుకుంటాం'