ETV Bharat / state

పాతబస్తీలో కేంద్ర వైద్య బృందం పర్యటన - Central_Team_Visit_Charminar

హైదరాబాద్​లో పర్యటించేందుకు వచ్చిన కేంద్ర వైద్య బృందం పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో తిరిగారు. కరోనా కట్టడికి చేపడుతున్న చర్యల గురించి సీపీ అంజనీకుమార్​ కేంద్ర బృందానికి వివరించారు.

Central_Team_Visit_Charminar
పాతబస్తీలో కేంద్ర వైద్య బృందం పర్యటన
author img

By

Published : Apr 26, 2020, 5:24 AM IST

హైదరాబాద్​ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఐఏఎస్​ అధికారి అరుణ్​ బకోరా బృందం.. చార్మినార్, మక్కా మసీదులను పరిశీలించింది. కరోనా వైరస్​ కట్టడికి చేపడుతున్న చర్యల గురించి నగర పోలీసు కమిషనర్​ అంజనీకుమార్​ కేంద్ర బృందానికి వివరించారు. లాక్​డౌన్​ అమలు తీరు గురించి కూడా కమిషనర్​ వారికి తెలియజేశారు.

చార్మినార్, మక్కా మసీదు చారిత్రక కట్టడాల గురించి బృందానికి అంజనీకుమార్​ వివరించారు. కొద్దిసేపు అక్కడే ఉన్న కేంద్ర బృందం పాతబస్తీ నుంచి తిరిగి వెళ్లిపోయింది. బృందం వెంట ట్రాఫిక్​ అదనపు కమిషనర్ అనిల్​కుమార్, ట్రాఫిక్​ డీసీపీ బాబురావు తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి: ఐదు దశల్లో లాక్​డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.