ETV Bharat / state

మరో రెండురోజులు కేంద్ర బృందం పర్యటన - Central team on corona in telangana

కరోనా వైరస్ నివారణ చర్యల పరిశీలనకు రాష్ట్రానికి వచ్చిన కేంద్రబృందం... మరో రెండురోజులు ఇక్కడే పర్యటించే అవకాశముంది. వైరస్​ నివారణ చర్యలపై ఆరా తీయనుంది.

Central team Touring in telangana past 5 days
మరో రెండు రోజులు కేంద్రబృందం పర్యటన
author img

By

Published : Apr 30, 2020, 12:05 PM IST

కరోనా నివారణ చర్యలపై రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం... వరుసగా ఆరో రోజు హైదరాబాద్​లో పర్యటిస్తోంది. ఇవాళ పలు ప్రాంతాల్లో పర్యటించే అవకాశముంది. బుధవారం బీఆర్కే భవన్​లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అధికారులతో సమావేశమైన బృందం... కరోనా నిర్ధరణ పరీక్షల నిర్వహణ, పాజిటివ్ రోగులకు చికిత్స, సంబంధిత అంశాలపై ఆరా తీసింది. వైద్య పరమైన అంశాలకు సంబంధించి అధికారుల ద్వారా అడిగి బృంద సభ్యులు తెలుసుకున్నారు. అనంతరం సంజీవరెడ్డి నగర్​లోని ఆయుర్వేద ఆసుపత్రిని కేంద్ర బృందం సందర్శించింది. అక్కడి ఏర్పాట్లు, సదుపాయాలు, వసతుల గురించి ఆరా తీసింది. మరో రెండు రోజుల పాటు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపి లేక రోగుల విలవిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.