ETV Bharat / state

హైదరాబాద్​లో కరోనా కట్టడికి ఏం చేస్తున్నారు?: కేంద్ర బృందం ఆరా - central team latest news

కరోనాపై రాష్ట్ర పోరాటాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర బృందం... నాలుగో రోజూ విస్తృతంగా పర్యటించింది. మంగళవారం గుడిమల్కాపర్‌ మండీ, జీహెచ్​ఎంసీ కంట్రోల్‌ రూం, నైట్‌ షెల్టర్లు, కింగ్‌ కోఠి ఆస్పత్రికి వెళ్లి అక్కడ కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆరాతీసింది. కేంద్ర బృందం ఇవాళ మరికొన్ని ప్రాంతాలను సందర్శించి వివరాలను సేకరించనుంది.

central team fourth day tour in Hyderabad
నాలుగో రోజు విస్తృతంగా పర్యటింటిన కేంద్ర బృందం
author img

By

Published : Apr 29, 2020, 6:36 AM IST

అత్యధిక కరోనా కేసులు వెలుగు చూస్తున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో కేంద్ర బృందం పర్యటన నాలుగో రోజూ కొనసాగింది. కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ భరొక నేతృత్వంలోని కేంద్ర బృందం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కరోనా కంట్రోల్ రూం పనితీరును ప్రత్యేకాధికారి అనురాధ వివరించారు. కేంద్ర బృందం పలు అంశాలపై ప్రశ్నించి, అప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారులకు ఫోన్ చేయించి ధ్రువీకరించుకున్నారు.

వలస కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలు

వలస కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలు, వారి నుంచి కంట్రోల్ రూంకు వస్తున్న కాల్స్, ఏ ఏ శాఖలు, జిల్లాలతో సమన్వయం చేసుకుంటున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఆహారం పంపిణీ చేసిన వారి వివరాలు, ఎంత మందికి ఆహారం అందింది అనే వివరాలు తెలుసుకున్నారు. మూడు షిఫ్టులలో 24 గంటలు పనిచేస్తున్నట్లు కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. అత్యవసర సేవలు అందించేందుకు 32 అంబులెన్స్‌లను జోనల్ కమిషనర్ కార్యాలయాలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

విదేశాల నుంచి వచ్చి వారు

విదేశాల నుంచి వచ్చి ఇక్కడ హోటల్స్‌లో ఉంటున్న వారిని పర్యాటక అధికారి పర్యవేక్షిస్తునట్లు వెల్లడించారు. హెల్ప్‌లైన్ నెంబర్ 040-2111 11 11 కు వచ్చిన ప్రతి కాల్‌ను రిజిస్టర్‌లో నమోదుచేసి స్పందిస్తున్నట్లు తెలిపారు. మంత్రులు, జీహెచ్​ఎంసీ చేపట్టిన కార్యక్రమాల విడియోలను కేంద్ర కమిటీ వీక్షించింది. పారిశుద్ధ్య, ఎంటమాలజీ, డీఆర్​ఎఫ్​ సేవలను అభినందిస్తు మంత్రి కేటీఆర్​... వారితో భోజనం చేసిన వీడియోలను చూసి అభినందించారు. అనంతరం కమిటీ సభ్యులు జీహెచ్​ఎంసీ కమాండ్ కాంట్రోల్ రూమ్‌ను సందర్శించి, ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ సిస్టంను పరిశీలించారు.

కింగ్‌ కోఠి ఆసుపత్రిలో అధికారులతో సమావేశం

అంతకుముందు గుడిమల్కాపూర్ మండీని సందర్శించిన కేంద్ర బృందం... అక్కడ కూరగాయలు అమ్మే సమయంలో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కరోనా బాధితులకు అందిస్తున్న సేవలతో పాటు పలు అంశాలను తెలుసుకున్నారు. కేంద్ర బృందం సాయంత్రం విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్ హోంను సందర్శించారు. వివిధ రాష్టాలకు చెందిన 102 మంది వలస కార్మికులకు కల్పించిన వసతుల వివరాలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి కింగ్‌ కోఠి ఆసుపత్రిలో అధికారులతో సమావేశమయ్యారు. మొదట మూడు రోజుల పర్యటనకు హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర బృందం... నాలుగో రోజు కూడా పరిశీలించారు. నేడు కూడా పలు ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.