ETV Bharat / state

Rice: బియ్యం ఇచ్చేందుకు గడువు పొడిగించలేం: కేంద్రం

బియ్యం ఇచ్చే విషయంలో మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఎఫ్​సీఐ గుర్తించిన నేపథ్యంలో.. ఇకపై బియ్యం(Rice) ఇచ్చేందుకు గడువు పెంచడం కుదరదని కేంద్రం పేర్కొంది. ఇన్ని సార్లు గడువు పొడిగించినా మిల్లర్ల నుంచి ఇదే పోకడ కొనసాగుతోందని మండిపడింది. ఈమేరకు గడువు కోరిన సీఎస్​కు లేఖ ద్వారా కేంద్రం స్పష్టం చేసింది.

central Ministry of Food and Public Distribution
భారత ఆహార సంస్థ
author img

By

Published : Jul 22, 2021, 8:26 AM IST

‘భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు బియ్యం(Rice) ఇచ్చేందుకు గడువు పొడిగించటం కుదరదు. ఆ బియ్యాన్ని ఇప్పటికే కేంద్ర కోటా (సెంట్రల్‌ పూల్‌) నుంచి తొలగించాం’ అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే రాష్ట్రానికి స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు. బియ్యం ఇచ్చేందుకు మరో 30 రోజుల గడువు ఇవ్వాల్సిందిగా సీఎస్‌ ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో కేంద్రానికి లేఖలు రాశారు. ‘ఇప్పటికే కేంద్రం అయిదు దఫాలు గడువు పొడిగించినా మిల్లర్లు స్పందించకపోవటంతో గడువు పొడిగించేది లేదు’అని కేంద్రం ఏప్రిల్‌లో రాసిన లేఖలో స్పష్టం చేసింది. అయినప్పటికీ గడువు ఇవ్వాల్సిందిగా సీఎస్​ కేంద్రాన్ని కోరారు.

అక్రమాలకు అవకాశం

ఈ నేపథ్యంలో ‘‘ఒకటికి మించిన సీజన్లకు సంబంధించిన బియ్యాన్ని సకాలంలో ఇవ్వకపోవటం కారణంగా మిల్లర్లు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. భవిష్యత్తులోనైనా మిల్లర్ల నుంచి సకాలంలో బియ్యం ఎఫ్‌సీఐకి చేరేలా ప్రణాళికను రూపొందించాలి’’అని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 2019-20 సంవత్సరపు యాసంగి (రబీ) సీజనుకు సంబంధించిన సుమారు 1.01 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. నిజానికి ఈ బియ్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు.

25,303 టన్నులు మాయం

రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ధాన్యం నిల్వలను పరిశీలించాలని నిర్ణయించింది. ఎఫ్‌సీఐ అధికారులకు ఆ బాధ్యత అప్పగించింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తనిఖీ చేస్తే పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించింది. ఒక్క వరంగల్‌ జిల్లాలోనే 25,303 మెట్రిక్‌ టన్నుల ధాన్యం లేకపోవటాన్ని గుర్తించారు. కొన్ని జిల్లాల్లోని మిల్లుల్లో ధాన్యం నిల్వలు లెక్కించేందుకు వీలులేని విధంగా ఉండటాన్ని గుర్తించారు. ఆయా వివరాలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు నివేదిక పంపారు.

రూ.350 కోట్ల వసూలుకు వెనుకంజ

2019-20లో సుమారు 1.01 లక్ష మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు మింగేశారు. విషయం తెలిసినా మిల్లర్లపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడుతోంది. అందుకు కారణం మిల్లర్ల లాబీనా? లేక పెద్దలెవరివైనా అండదండలున్నాయా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. మిల్లర్లు ఎగవేసిన బియ్యం విలువ రూ. 300 కోట్ల నుంచి రూ. 350 కోట్ల వరకు ఉంటుందన్నది అంచనా. ఆ మొత్తానికి ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీలు చెల్లిస్తున్నా.. బియ్యం మింగిన మిల్లర్ల నుంచి వాటిని వసూలు చేసేందుకు మాత్రం ఆసక్తి చూపకపోవటం విశేషం.

ఇదీ చదవండి: RICE: తెలంగాణ దొడ్డురకం బియ్యానికి గడ్డుకాలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.