ETV Bharat / state

ఎఫ్‌సీఐ నిబంధనలను తెలంగాణ పట్టించుకోవడం లేదు: గోయల్‌

author img

By

Published : Jul 20, 2022, 6:06 PM IST

Updated : Jul 20, 2022, 8:25 PM IST

Goyal on rice
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/20-July-2022/15877508_54.png

18:04 July 20

Piyush Goyal on paddy: తెలంగాణ ప్రభుత్వం ఒక విఫల ప్రభుత్వం: గోయల్‌

ఎఫ్‌సీఐ నిబంధనలను తెలంగాణ పట్టించుకోవడం లేదు: గోయల్‌

Piyush Goyal on paddy: తెలంగాణలో ధాన్యం, బియ్యం సేకరణకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ధాన్యం సేకరణపై ఎఫ్​సీఐ క్లియరెన్స్​ ఇస్తుందని ఆయన వెల్లడించారు. పేదలకు సాయం చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పని చేస్తోందని పేర్కొన్నారు. పేదలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదన్నారు. పేదలకు ఇంత అన్యాయం చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని గోయల్‌ విమర్శించారు.

పేదలకు ఉన్న హక్కు ప్రకారం వారికి ఆహారధాన్యాలు అందాల్సిందేనని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి 5 కిలోల చొప్పున అదనపు ధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఒక విఫల ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సీఎం, మంత్రులు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారని గోయల్‌ అన్నారు. రాజకీయ అజెండాతోనే కేంద్రంపై తెరాస ప్రభుత్వం నిందలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రతిదీ రాజకీయం చేయకుండా.. పేదల గురించి ఆలోచించాలని హితవు పలికారు. ఎఫ్‌సీఐ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పీయూష్ గోయల్‌ విమర్శించారు.

ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే: కిషన్ రెడ్డి

ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం ధాన్యం సేకరిస్తున్నా ఉద్దేశపూర్వకంగా తెరాస నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం రూ.3.5 లక్షల కోట్లు ఖర్చుతో ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇస్తోందని ఆయన తెలిపారు. రైతులు, రైస్‌ మిల్లర్ల పరిస్థితి దృష్ట్యా ధాన్యం కొనుగోలుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: Kishanreddy on TRS: ఆ విషయంలో తెరాస తప్పుదోవ పట్టిస్తోంది: కిషన్‌రెడ్డి

'రోజూ ఇవి ఎలా తినగలం సారూ?'.. మాడిన రొట్టెలపై కోర్టులో ఖైదీ ఫిర్యాదు

Last Updated : Jul 20, 2022, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.