ETV Bharat / state

Piyush Goyal on Cm kcr: 'ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు'

Piyush Goyal on Cm kcr: తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళ పరుస్తోందని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. దిల్లీలో ధాన్యం సేకరణపై మాట్లాడిన ఆయన... సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

Piyush
Piyush
author img

By

Published : Dec 21, 2021, 2:13 PM IST

Piyush Goyal on Cm kcr: తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధాని కృషి చేస్తున్నారని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారన్న ఆయన... తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళ పరుస్తోందని ఆరోపించారు. రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా అంగీకరించామని పీయుష్ గోయల్ స్పష్టం చేశారు.

అదనంగా 20 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకునేందుకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చామని పీయుష్ వెల్లడించారు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన ధాన్యాన్ని తెలంగాణ ఇవ్వలేదని మరోమారు తెలిపారు. నాలుగుసార్లు గడువు కూడా పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు.

గడువు పొడిగించినా రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోంది. దేశంలో ఉప్పుడు బియ్యాన్ని చాలా తక్కువగా తింటారు. రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామని ఏడాది క్రితమే చెప్పాం. ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని సేకరించి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రా రైస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే మొత్తం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.

-- పీయుష్ గోయల్, కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి

ఇదీ చూడండి: Telangana Ministers: ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం మరోమారు చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.