ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ - తెలంగాణ వార్తలు

ఎంఎంటీఎస్ రైళ్ల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ సీఎం కేసీఆర్​కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రైళ్లు ఇంకా ప్రారంభం కాకపోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.

central-minister-kishan-reddy-wrote-letter-to-cm-kcr-about-mmts-trains-in-hyderabad
సీఎం కేసీఆర్​కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!
author img

By

Published : Feb 8, 2021, 5:48 PM IST

లాక్​డౌన్​తో నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్ల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్​కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి లేఖ రాశారు. కరోనా తగ్గుముఖం పడుతున్నందున ఎంఎంటీఎస్ రైళ్లను వెంటనే నడపాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైల్వే శాఖను కోరాలని సూచించారు.

హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు తిరుగుతున్నాయని అన్నారు. మహారాష్ట్ర, ముంబయిలో లోకల్ రైళ్లను అక్కడి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో రైల్వే శాఖ నడిపిస్తోందని గుర్తు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేలా రాష్ట్రప్రభుత్వం రైల్వే శాఖతో చర్చించాలన్నారు.

అతి తక్కువ ఛార్జీలతో సౌకర్యవంతంగా, వేగంగా గమ్య స్థానాలకు ప్రయాణీకులను చేరవేసే రైళ్లు.. ఇంకా ప్రారంభం కాకపోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు, శివారు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

ఇదీ చదవండి: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.