హైదరాబాద్ కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. బ్లాక్ ఫంగస్ వార్డులో బాధితులను పరామర్శించారు. వైద్య సేవలపై ఆరా తీశారు. కొవిడ్ నుంచి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్ మహమ్మారి సోకుతున్న క్రమంలో... బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
కరోనా నుంచి కోలుకున్న డయాబెటిక్ రోగుల్లోనే బ్లాక్‌ఫంగస్ సమస్య ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. చికిత్సకు వాడే ఔషధాల కొరత వాస్తవమేనని... అవసరమైన ఔషధాలను దిగుమతి చేసుకుంటామని వెల్లడించారు. దేశంలోనూ బ్లాక్ ఫంగస్ చికిత్స ఔషధాల ఉత్పత్తి పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు 11 కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. చికిత్స కంటే కూడా కరోనా బారినపడకుండానే చర్యలు తీసుకోవటమే మంచిదని వెల్లడించారు. దేశంలోని ప్రతిపౌరుడు కరోనా వారియర్‌గా నడుచుకోవాలని సూచించారు. జూన్‌లో 10కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని... డిసెంబర్ వరకు 250 కోట్ల డోసుల టీకాలు ఉత్పత్తి అవుతాయన్నారు.
ఇదీ చూడండి: Telangana: అందుబాటులోకి సాధారణ, ఆక్సిజన్ పడకలు