ETV Bharat / state

ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యం: కిషన్‌ రెడ్డి

కేంద్ర బడ్జెట్​ మోదీ ఆలోచనలకు అనుగుణంగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ బడ్జెట్​లో ఆరోగ్యం, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యమేనని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యం: కిషన్‌ రెడ్డి
ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యం: కిషన్‌ రెడ్డి
author img

By

Published : Feb 1, 2021, 6:51 PM IST

సృజనాత్మకత, సామర్థ్యం, నాయకత్వం, మానవ వనరులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వనరులు వంటి 6 అంశాల ఆధారంగా ఆరోగ్యం, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కొత్త బడ్జెట్‌లో ఆత్మనిర్భర్​ భారత్​ని ఆర్థిక మంత్రి బడ్జెట్-2021లో ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా 5 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థను, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్​లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారన్నారు.

కొవిడ్-19 మహమ్మారి నుంచి ప్రతి భారతీయుడిని కాపాడే లక్ష్యంతో, ఈ బడ్జెట్​లో కొవిడ్ వ్యాక్సిన్ కోసం రూ.35,400 కోట్లు కేటాయించినట్లు, ప్రధాని మోదీ నాయకత్వంలోని తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యమేనని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారన్నారు. ఆర్ధిక మంత్రి కొత్తగా ప్రతిపాదించిన మెగా టెక్స్​టైల్ పార్క్ పథకం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి, భారత్ వస్త్ర ఎగుమతుల కేంద్రంగా మారుతుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీని కింద మూడు సంవత్సరాల కాలంలో 7 పార్కులు ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు.

ఇదీ చదవండి: నిర్మలమ్మ '2021 బడ్జెట్'​ హైలైట్స్​ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.