కేంద్రంలో భాజపా రెండోసారి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) పంపిణీ చేశారు. కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నె ఉమ రమేశ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. సమర్థవంతమైన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తిని నివారించడంలో ముందున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
కొవిడ్‌ను అరికట్టడంలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వ్యాక్సిన్ వినియోగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉండటం కేంద్ర ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమని తెలిపారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయాలు మాని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. కరోనా తగ్గేవరకు ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని కిషన్ రెడ్డి (Kishan Reddy)సూచించారు.