ETV Bharat / state

'మా సహనాన్ని అసమర్థతగా భావిస్తే.. కేసీఆర్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది' - తెరాస పార్టీపై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి మండిపాటు

Kishan Reddy fires on TRS: మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయంతో తెరాస పార్టీ దిగజారి వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. నైతిక విలువలు లేకుండా భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాకు సమాధి కట్టారని ఆయన ఆక్షేపించారు. సహనాన్ని అసమర్థతగా భావిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందని కిషన్‌ రెడ్డి హెచ్చరించారు. పుత్ర వాత్సల్యం కోసం తెరాసను భారాస చేశారని ఆరోపించిన కిషన్‌రెడ్డి ఆర్వోపై ఒత్తిడి తెచ్చి కోర్టుకు తప్పుడు సమాచారమిచ్చారని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతున్న కేసీఆర్ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చమత్కరించారు.

Central Minister Kishan Reddy
కేంద్రమంత్రి కిషన్​రెడ్డి
author img

By

Published : Oct 20, 2022, 8:54 PM IST

Kishan Reddy fires on TRS: తెరాస పూర్తిస్థాయిలో చిల్లర రాజకీయాలు చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతో అధికార పార్టీ దిగజారి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశ చరిత్రలో ముఖ్యమంత్రి ఒక గ్రామానికి ఇంచార్జీగా ఉన్న పరిస్థితిలేదన్నారు. హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్రమంత్రి...మానవత్వం,నైతిక విలువలు లేకుండా జేపీ నడ్డాకు సమాధి కట్టారని అగ్రహం వ్యక్తం చేశారు. బతికి ఉన్న వ్యక్తికి సమాధి కట్టి కొత్త సంప్రదాయానికి కేసీఆర్ కుటుంబం తెరలేపిందన్నారు. జేపీ నడ్డాకు సమాధి కట్టే హక్కు మీకెవరిచ్చారని నిలదీశారు. ఉన్మాదానికి కూడా హద్దు ఉంటుందని తెలిపారు. జేపీ నడ్డా ఏమైనా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో గెలిచారా? అని తెరాస నాయకత్వాన్ని ప్రశ్నించారు.

తెరాసపై విరుచుకు పడుతున్న కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయంతో తెరాస పార్టీ దిగజారి వ్యవహరిస్తోంది. నైతిక విలువలు లేకుండా భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాకు సమాధి కట్టారు. సహనాన్ని అసమర్థతగా భావిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోంది. పుత్ర వాత్సల్యం కోసం తెరాసను భారాస చేశారు. ఆర్వోపై ఒత్తిడి తెచ్చి కోర్టుకు తప్పుడు సమాచారమిచ్చారు. అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతున్న కేసీఆర్ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. - కిషన్‌ రెడ్డి, కేంద్ర పర్యాటక మంత్రి

మా సహనాన్ని అసమర్థతగా భావిస్తే కేసీఆర్‌ కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు. బతికి ఉన్న వాళ్లకు సమాధి కట్టి నివాళులర్పించడం కేసీఆర్ కుటుంబం సంప్రదాయమా అని ప్రశ్నించారు. వికృత చేష్టలు ఓడిపోయే వాళ్లే చేస్తారు తప్ప గెలిచేవాళ్లు కాదని స్పష్టం చేశారు. తెరాసయేతర పార్టీ జెండా పట్టుకుని...ప్రచారానికి వెళితే బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కుర్చీ తన కుటుంబానికే ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పుత్ర వాత్సల్యం కోసం తెరాసను భారాస చేశారని ఎద్దేవా చేశారు.

తెరాస నుంచి కవులు కళాకారులు ఉద్యమకారులు వైద్యులు బయటకు వెళ్లిపోయారని తెలిపారు. మునుగోడు రిటర్నింగ్ అధికారిపై ఒత్తిడి తెచ్చి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆక్షేపించారు. మునుగోడులో హుజురాబాద్ ఫలితాలే పునరావృతమవుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ఆర్థిక సాయం చేశామని కిషన్‌రెడ్డి చెప్పుకు వచ్చారు. నీరాజనాలు కేసీఆర్ కుటుంబానికి.. నీలాపనిందలు కేంద్రానికా? అని అన్నారు. అబద్ధాలు చెప్పడంలో పోటీ పడుతున్న కేసీఆర్​ కుటుంబానికి ఆస్కార్​ అవార్డు ఇవ్వాలని చమత్కరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.