ETV Bharat / state

'ఆయన పేరు వింటేనే వణుకు' - కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి వార్తలు

టైగర్ నరేంద్ర పేరు వింటేనే మజ్లీస్ నేతల్లో వణుకు పుట్టేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన స్ఫూర్తితో కార్యకర్తలు పని చేయాలని సూచించారు. తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

central home minister kishan reddy at ale narendra vardhanthi
'ఆయన పేరు వింటేనే మజ్లిస్ నేతల్లో వణుకు పుట్టేది'
author img

By

Published : Apr 9, 2021, 1:39 PM IST

తెలంగాణ సాధనలో అలె నరేంద్ర కీలకపాత్ర పోషించారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో అలె నరేంద్ర వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిషన్​ రెడ్డి హాజరై నరేంద్ర చిత్రపటానికి నివాళులు అర్పించారు.

పాతపట్నంలో మజ్లీస్ ఆగడాలు, దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడిన మహా వ్యక్తి నరేంద్ర అని కిషన్​ రెడ్డి కొనియాడారు. టైగర్ నరేంద్ర పేరు చెబితే మజ్లీస్ నేతలకు వణుకు పుట్టేదని వ్యాఖ్యానించారు. ఆయన స్ఫూర్తితో భాజపా కార్యకర్తలు పనిచేయాలని... తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు.

ఇదీ చూడండి: అభిమానుల ఆగ్రహానికి థియేటర్​ ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.