ETV Bharat / state

Central Govt Petition on Singareni Elections : సింగరేణి ఎన్నికలపై మరో ట్విస్ట్​.. హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర కార్మికశాఖ

Central Labor Department Petition on Singreni Elections : సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలకు సహకరించేలా.. సింగరేణి యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్ర కార్మికశాఖ హైకోర్టును ఆశ్రయించింది. సింగరేణి ఎన్నికలకు షెడ్యూల్​ ప్రకటించినప్పటికీ.. సింగరేణి కాలరీస్ యాజమాన్యం సహకరించడం లేదని కేంద్ర ప్రభుత్వం తన పిటిషన్​లో పేర్కొంది.

Singareni Collieries Company
Central Govt Petition on Singareni Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2023, 10:27 PM IST

Central Govt Petition on Singareni Elections : సింగరేణి ఎన్నికల ప్రక్రియ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. తాజాగా కేంద్ర కార్మికశాఖ.. సింగరేణి ఎన్నికలకు(SCCL) సహకరించేలా సింగరేణి యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 28న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర కార్మిక శాఖ షెడ్యూలు విడుదల చేసింది.

SCCL Thirty Two Percent Share to Workers : సింగరేణి కార్మికులకు గుడ్​ న్యూస్.. రూ.700 కోట్ల బోనస్

షెడ్యూలు ప్రకారం గత నెల 30న ఓటరు జాబితా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించి.. ఈ నెల 5న తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. అయితే సింగరేణి కాలరీస్ యాజమాన్యం సహకరించడం లేదని పిటిషన్ లో కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ కమిషనర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. గత నెల 27న సమావేశం పెడితే సింగరేణి యాజమాన్యం హాజరు కాలేదని.. ఇప్పటి వరకు ఓటరు జాబితా వెల్లడించలేదన్నారు.

Singareni Collieries Company : సింగరేణి యాజమాన్యం సహకరించక పోవడం వల్ల.. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణలో ముందుకెళ్లలేక పోతున్నామని పిటిషన్ లో కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది. కాబట్టి ఎన్నికలకు సహకరించాలని సింగరేణి కాలరీస్​తో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలని కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును కోరింది.

సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సింగిల్​ జడ్జి ఆదేశించింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకూ ఎన్నికలు వాయిదా వేయాలని.. అప్పటి వరకు సింగిల్ జడ్జి తీర్పును నిలిపివేయాలంటూ సింగరేణి యాజమాన్యం ఇప్పటికే డివిజన్ బెంచిని ఆశ్రయించింది. దీంతో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనా.. ఎలక్షన్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.

Central Labor Department : తెలంగాణలో త్వరలో శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. 42,000 పైగా ఓటర్లున్న సింగరేణిలో ఎన్నికలకు.. భారీ బందోబస్తుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సేవలు అవసరం. ఈ నేపథ్యంలోనే సంబంధిత కలెక్టర్లు, ఎస్పీలు సింగరేణి ఎన్నికలలో పాల్గొనలేమని ఎన్నికల అధికారికి వెల్లడించారు.

మరోవైపు కార్మిక సంఘాల్లో అధికశాతం ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని.. సింగరేణి సంస్థలోని 13 యూనియన్లు లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారి శ్రీనివాసులును కోరాయి. అలాగే గెలిచిన సంఘం కాలపరిమితి.. గత ఒప్పందాల అమలు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి.

మరోవైపు సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుక ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో 32 శాతం వాటాను ఇవ్వాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 42,390 మంది ఉద్యోగుల ఖాతాల్లో రూ.711 కోట్లను జమ చేయనుంది.

బొగ్గు ఉత్పత్తిలో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సింగరేణి

కేంద్ర బడ్జెట్.. తెలంగాణలోని సంస్థలకు ఇచ్చిన కేటాయింపులు ఇవే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.