ETV Bharat / state

దేశ సంపదను కేంద్రం ప్రైవేట్​పరం చేస్తోంది : వినోద్​కుమార్ - హైదరాబాద్ తాజా సమాచారం

విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ ప్రైవేట్​కు అప్పగిస్తున్నారని ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు బోయిన్​పల్లి వినోద్​కుమార్ ఆరోపించారు. ఈ నెల 26న తలపెట్టిన కేంద్రప్రభుత్వ ఉద్యోగుల సార్వత్రిక సమ్మెకు తెరాస పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

central govt organozations all are giving private says vinodkumar
దేశ సంపదను కేంద్రం ప్రైవేట్​పరం చేస్తోంది : వినోద్​కుమార్
author img

By

Published : Nov 19, 2020, 8:29 PM IST

కేంద్ర ప్రభుత్వరంగ ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఈనెల 26న చేపట్టిన సార్వత్రికసమ్మెకు తెరాస సంపూర్ణ మద్దతు ఇవ్వనునన్నట్లు ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు బోయిన్​పల్లి వినోద్​కుమార్ వెల్లడించారు. బీఎస్​ఎన్​ఎల్, ఎల్​ఐసీ, కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.

దేశసంపద ప్రైవేటుపరం:

​ 5జీ సేవలను బీఎస్​ఎన్​ఎల్​కు అప్పగించకుండా ఊపిరి తీస్తున్నారని మండిపడ్డారు. దేశ సంపదను కాపాడాల్సిన మోదీ ప్రభుత్వం ప్రైవేట్​ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. రైల్వేను సైతం ప్రైవేటుకు అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

దేశంలోనే సురక్షిత నగరం:

శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ దేశంలోనే సురక్షిత నగరమని ఆయన పేర్కొన్నారు. ఆరేళ్ల పాలనలో ఒక్కరోజు కూడ కర్ఫ్యూ విధించలేదని తెలిపారు. దేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలు నగరంలో శాంతిభద్రతల మధ్య జీవిస్తున్నారని వినోద్​కుమార్ అన్నారు. ఈ సమావేశంలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంపత్​రావు, సాంబశివరావు, సుశీల్ కుమార్, చంద్రమౌళి, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తప్పైతే శిక్షించండి... నిజమైతే ఆశీర్వదించండి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.