ఈశాన్య దిల్లీలో ఆస్తుల ధ్వంసం, హింసకు కారణమైన వారిని గుర్తించి ఎఫ్ఐఆర్లు నమోదు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రెండు రోజులుగా అక్కడ మామూలు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దుకాణాలు తెరుచుకుంటున్నాయని, ప్రజలు బయటికి వస్తున్నారన్నారు.
దాదాపు అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేశామని తెలిపారు. కేవలం నాలుగు చోట్ల 144 సెక్షన్ అమల్లో ఉందని పేర్కొన్నారు. అక్కడ సైతం త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : 'తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లే...'