సికింద్రాబాద్‌లో రూ. 22 లక్షల తో నిర్మించిన సామాజిక భవనాన్ని ఎంపీ బండారు దత్తాత్రేయ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున నిధులను కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఎంఎంటీఎస్ రెండోదశ భువనగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు పొడిగించే పనులకు నిధులను కేటాయించిందన్నారు. బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరిచే విధంగా ఉందని స్పష్టం చేశారు.