ETV Bharat / state

'కొవిడ్​ టీకాతో ఇప్పటిదాకా దుష్ఫలితాలేమీ లేవు' - Central Government Chief Scientific Adviser Vijayaraghavan comments

కొవిడ్‌ టీకా సురక్షితమని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు విజయరాఘవన్‌ వెల్లడించారు. ఇప్పటిదాకా టీకాతో తీవ్ర దుష్ఫలితాలేమీ లేవని స్పష్టం చేశారు. అన్ని రకాలుగా ఫలితాలను విశ్లేషించాకే అనుమతినిచ్చినట్లు పేర్కొన్నారు. బ్రిటన్‌ వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం కొవాగ్జిన్‌కు ఉందని వివరించారు.

కొవిడ్​ టీకాతో ఇప్పటిదాకా దుష్ఫలితాలేమీ లేవు..

author img

By

Published : Jan 29, 2021, 6:41 AM IST

కేంద్ర ప్రభుత్వం అనుమతించిన రెండు కొవిడ్‌ టీకాలు సురక్షితమైనవేనని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు ఆచార్య కె.విజయరాఘవన్‌ స్పష్టం చేశారు. టీకాల సమర్థతకూ ఎటువంటి ఢోకా లేదన్నారు. అన్ని రకాల పరిశోధనల ఫలితాలను విశ్లేషించిన తర్వాతే కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులిచ్చిందని తెలిపారు. టీకాల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచ దేశాల్లో ముందు వరుసలో ఉందనీ, ఇతర దేశాల్లో వినియోగించే టీకాల్లో ప్రతి మూడింటిలో ఒకటి భారత్‌ ఉత్పత్తి కావడం విశేషమని ఆయన చెప్పారు. ‘భారత్‌లో టీకా అభివృద్ధి’ అనే అంశంపై గురువారం అస్కీ ఛైర్మన్‌ కె.పద్మనాభయ్య అధ్యక్షతన జరిగిన వెబినార్‌లో కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు ఆచార్య కె.విజయరాఘవన్‌ ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

మరణాలు సంభవిస్తాయని భావించడం అపోహే

కొవిడ్‌ కొత్త వ్యాధి. టీకా కూడా కొత్తగా అందుబాటులోకి వచ్చిందే. ఇటువంటప్పుడు కొంత భయాందోళనలు సహజమే. అయితే ఒక్కటి గుర్తుంచుకోవాలి.. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే అనుమతులిచ్చింది. తీవ్ర దుష్ఫలితాలు వస్తాయని.. మరణాలు సంభవిస్తాయని భావించడం అపోహే. టీకా పొందిన తర్వాత మరణించినంత మాత్రాన.. టీకానే కారణమని అనుకోవడం సరైంది కాదు. రోజూ అల్పాహారం తీసుకుంటాం. ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత గుండెపోటు వచ్చి చనిపోతే.. దానికి కారణం అల్పాహారమని అనుకుంటే ఎలా? కచ్చితంగా కారణాలను అన్వేషించాలి. అయినా ప్రతి దుష్ఫలితంపైనా లోతుగా విశ్లేషణాత్మక ప్రయోగాలు జరుగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు విజయరాఘవన్‌

యువతపై కొవిడ్‌ తీవ్రత తక్కువ

వైద్యసిబ్బంది, రెవెన్యూ, పోలీసు, పురపాలక తదితర పోరాట యోధులకు టీకాలివ్వడం పూర్తయ్యాక 50 ఏళ్ల పైబడినవారికి, ఆ లోపు వయసులో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకాలను అందజేస్తారు. ఆసమయంలో కొవిన్‌యాప్‌ ఆండ్రాయిడ్‌, ఆపిల్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. అప్పుడు ఎవరికి వారు స్వీయ నమోదు చేసుకోవచ్చు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్య కోసం ఎక్కువగా బయటకొచ్చే యువతకు ముందుగా టీకాలను ఇవ్వచ్చు కదా.. అని కొందరు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. ఎవరికి ముందుగా ఇవ్వాలనే విషయంలో పెద్ద అధ్యయనమే జరిగింది. యువత ఎక్కువగా వైరస్‌ బారినపడుతున్నా.. వారిపై కొవిడ్‌ తీవ్రత తక్కువ. వారికి తెలియకుండానే వచ్చి, తగ్గిపోయి ఉంటుంది. అదే 50 ఏళ్ల పైబడినవారిలో తీవ్రత అధికంగా ఉంది. మొత్తం కొవిడ్‌ మరణాల్లో వీరి సంఖ్య దాదాపు 70 శాతం దాటింది. అందుకే 50 ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది.

మున్ముందు ఒకే డోసు ఇచ్చేలా ప్రయోగాలు

బ్రిటన్‌ వైరస్‌కు కూడా కొవాగ్జిన్‌ టీకా సమర్థంగా పనిచేస్తుందని ఇటీవలే ధ్రువీకరించారు. ప్రస్తుతమున్న టీకాలను 2 డోసులు వేసుకోవాలి. మున్ముందు ఒకే డోసు ఇచ్చే దిశగానూ ప్రయోగాలు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో ఇతర వ్యాక్సిన్లతో కలిపి కూడా కొవిడ్‌ టీకాను ఇచ్చే అవకాశాలున్నాయి. చిన్నారుల్లో క్షయ రాకుండా ఇచ్చే బీసీజీ టీకా వల్ల కొవిడ్‌ను నిరోధించవచ్చనడానికి ఆధారాల్లేవు’’ అని విజయరాఘవన్‌ పేర్కొన్నారు.

వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం టీకాతోనే..

‘‘కరోనా వైరస్‌ మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. దాన్ని ఎదుర్కోవడానికి మనలోని రోగ నిరోధక వ్యవస్థ ఎదురు దాడి చేస్తుంది. కొన్నిసార్లు రోగ నిరోధక వ్యవస్థ గెలుస్తుంది. కొన్నిసార్లు వైరస్‌ పైచేయి సాధించి, కణాల అంతర్భాగాల్లో పాతుకుపోతుంది. తద్వారా కొందరిలో స్వల్ప ఇన్‌ఫెక్షన్‌, మరికొందరిలో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. వీరిని అనారోగ్యానికి గురి చేయడమే కాకుండా.. వీరి ద్వారా ఇతరులకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఎటువంటి కొవిడ్‌ లక్షణాల్లేని వారు కూడా కరోనా వైరస్‌ వ్యాప్తికి కారకులవుతున్నారు. అతి వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న ఈ వైరస్‌ను కట్టడి చేయాలంటే మన ముందున్న మార్గాలు మూడే.

ఔషధాలు: కచ్చితమైన ఔషధాలంటూ ఏమీ లేవు. ఇప్పుడు చికిత్సకు ఉపయోగిస్తున్న ఔషధాలతో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ చికిత్సను కొనసాగించాల్సిందే.

మాస్కులు, శుభ్రత: ముఖానికి మాస్కులు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపర్చుకోవడం, గుంపుల్లోకి వెళ్లకపోవడం, సురక్షిత దూరాన్ని పాటించడం.. ఇవన్నీ కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి.

టీకాలు: కొవిడ్‌ కట్టడిలో ప్రస్తుతానికి అసలుసిసలైనదిదే. అదృష్టవశాత్తు కొవిడ్‌ టీకా త్వరగానే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన 2 టీకాలూ కొవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడే రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సమర్థంగా పనిచేస్తాయి. యాంటీబాడీస్‌ ఉత్పత్తి అయి, అవి అంతర్గత కణాల్లో నిక్షిప్తమై ఉంటాయి. ఎప్పుడైతే కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తుందో.. అప్పుడు ఆ యాంటీబాడీస్‌ వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. రోగ నిరోధక శక్తిని ఎక్కువమందిలో పెంపొందించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు. దాని వేగానికీ అడ్డుకట్ట వేయొచ్చు. త్వరలో మరికొన్ని టీకాలు కూడా రానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.