ETV Bharat / state

'రాబడులు పెంచుకునే యోచనలో కేంద్రం' - income tax latest updates

పెండింగ్‌ బకాయిలను రాబట్టడం ద్వారా రాబడులను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్థిక ఏడాది ముగిసే నాటికి కనీసం రూ. లక్ష కోట్లైనా.. మొండి బాకీలు వసూలు చేయాలని అంచనా వేస్తున్న ఐటీ అధికారులు జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. వివాదాల్లో చిక్కుకుని ఉన్న కేసులను "వివాద్‌ సే విశ్వాస్‌- 2020'' పథకం ద్వారా రాయితీలు కల్పించి రాబడులు పెంచుకోవాలని కేంద్ర యోచిస్తోంది.

రాబడులు పెంచుకునే యోచనలో కేంద్రం
వివాద్ సే విశ్వాస్ -2020 పథకం
author img

By

Published : Mar 17, 2020, 12:29 PM IST

ఆదాయపు పన్ను శాఖ ద్వారా 2019- 20 ఆర్థిక ఏడాదిలో రూ. 13.35 లక్షల కోట్ల వసూళ్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. దేశంలో నెలకొన్న వివిధ ప్రతికూల అంశాల కారణంగా నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రత్యక్ష పన్నులు వసూళ్లు అయ్యే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2018- 19 ఆర్థిక ఏడాదిలో రూ. 11.37 లక్షల కోట్ల రాబడి ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు - సీబీడీటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కార్పొరేట్‌ పన్నుల కింద రూ. 6.63లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయపు పన్ను ద్వారా రూ.4.73లక్షల కోట్లు, ఇతరత్ర రూ. వెయ్యి కోట్ల లెక్కన వచ్చినట్లు ప్రకటించింది.

రూ. లక్షకోట్లైనా...

ప్రస్తుత పరిస్థితుల్లో 2019- 20 ఆర్థిక ఏడాది లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఏ మాత్రం లేదు. రెండు లక్షల కోట్లకుపైగా మొత్తాన్ని నిర్దేశించిన లక్ష్యంతో సవరించే అవకాశం ఉందని ఐటీ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో పన్ను వసూళ్లను పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా చాలాకాలంగా పరిష్కారం కాని పెండింగ్‌ కేసులను రాయితీలు ఇవ్వడం ద్వారా పరిష్కరించి పన్నుల వసూళ్లను పెంచుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. 'వివాద్​ సే విశ్వాస్‌- 2020' పథకం ద్వారా దేశవ్యాప్తంగా కనీసం రూ. లక్ష కోట్లైనా.. వసూళ్లు అవుతాయని ఐటీ శాఖ అంచనా వేస్తోంది.

ఫైళ్ల బూజు దులిపే పనిలో..

గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల ఫైళ్ల బూజు దులిపే పని ఆదాయపు పన్ను శాఖలో మొదలైంది. గత వారం, పది రోజులుగా అధికార యంత్రాంగం అంతా ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏయే కేసుల్లో ఎంత మొత్తం రావాలి? అవి ఎందుకు రావడం లేదు? ఏ స్థాయిలో కేసులు పెండింగ్‌ ఉన్నాయి? అందులో చెల్లించాల్సిన ఆదాయపు పన్ను ఎంత? దాని మీద ఉన్న వడ్డీ ఎంత? అపరాధ రుసుం ఎంత? తదితర వివరాలతో కూడిన జాబితాలను సిద్ధం చేస్తున్నారు.

ఉన్నత స్థాయిలో కసరత్తు..

మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 18 జోన్‌ల పరిధిలో పెండింగ్‌ కేసుల జాబితా తయారు చేసే కార్యక్రమం సాగుతున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. ఏయే రకాల రాయితీలు కల్పిస్తే... బకాయిదారులు చెల్లింపునకు ముందుకు వస్తారు? అదెలా ఉండాలి? ఎప్పటి వరకు సమయం ఇవ్వాలి? తదితర అంశాలపై ఉన్నత స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ఆర్​బీఐ అభయంతో లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.