ETV Bharat / state

Telangana Assembly Elections 2023 : ఎన్నికల ఎఫెక్ట్.. అధికారుల బదిలీలపై కసరత్తు షురూ

Harish Rao review Meeting with officials in Hyderabad : అధికారుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. శాసనసభ ఎన్నికల దృష్ట్యా.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి పోస్టింగులు ఉండేలా చూస్తోంది. ఇందులో భాగంగా పలువురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో పాటు ఇతర అధికారుల బదిలీలు జరగనున్నాయి.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023
author img

By

Published : Jun 4, 2023, 7:21 AM IST

తెలంగాణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు

Central Election Commission preparations in Telangana : ఈ ఏడాది చివరన జరిగే శాసనసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహకాలకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు శిక్షణ సహా.. ఇతరత్రా కార్యక్రమాలను ప్రారంభించింది. ఎన్నికల కోసం అక్టోబర్ గడువుతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. బీఎల్‌వో ద్వారా ఇంటింటి పరిశీలన కొనసాగుతోంది. నకిలీ, మల్టిపుల్ ఎంట్రీ ఉన్న ఓటర్ల వడపోత సాగుతోంది.

Officers Transfer Experience above 3 Years in Telangana : ఈవీఎంల తొలిదశ పరిశీలనా ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. వాటన్నింటితో పాటు ఎన్నికల నిర్వహణ విధులతో నేరుగా ఉండే అధికారుల బదిలీలు, పోస్టింగులపై తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల సీఈవోలకు ఈసీ అదేశాలు జారీ చేసింది. మూడేళ్లకు పైబడి కొనసాగుతున్న వారిని బదిలీ చేయాలని.. పోస్టింగుల విషయంలో నిర్దేశిత మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది.

Exercise on postings of officers in Telangana : జులై నెలాఖరు వరకు నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో.. సదరు అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించే అధికారుల పోస్టింగులపై కసరత్తు చేస్తోంది. కలెక్టర్లకు సంబంధించి గతంలోనే ఆ కసరత్తు పూర్తి చేసింది. దీర్ఘకాలికంగా ఒకే చోట కొనసాగుతున్న వారిని బదిలీ చేసింది.

Harish Rao review Meeting with officials : ఈసీ ఆదేశాలతో ఆర్‌వో, అదనపు ఆర్‌వోలు ఇలా ఆయా పోస్టింగుల అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఎక్కువ రోజులుగా ఒకేచోట పని చేస్తున్న వారిని బదిలీ చేయనున్నారు. అధికారుల బదిలీలపై ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్​రావు సమీక్షించారు. ఈసీ మార్గదర్శకాలు పరిగణనలోకి తీసుకొని భారీగా అధికారుల బదిలీలు చేపట్టనున్నారు. రిటర్నింగ్ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ కసరత్తు పూర్తైనట్లు తెలిసింది.

19 Tehsildar promoted as Deputy Collector in Telangana : ఆ విషయంపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. మిగిలిన అధికారుల బదిలీలు జరగనున్నాయి. అవకాశం ఉన్న చోట పదోన్నతులు కల్పిస్తున్నారు. 19 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మిగతా వారికి దశల వారీగా పదోన్నతులు ఇవ్వనున్నారు. వీలైనంత త్వరగా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగులు పూర్తి చేయాలన్న ఆలోచనలో సర్కార్‌ ఉంది. ఎన్నికలు ఉన్నందున అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బదిలీల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.