కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కరోనాను అరికట్టాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తెలిపారు. ప్రజల్లో వైరస్ పట్ల అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. కరోనాపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ గౌబా దూరదృశ్య సమీక్షను నిర్వహించారు. సీఎస్ సోమేశ్ కుమార్, ప్రత్యేక సీఎస్ శాంతి కుమారి, ఆరోగ్యశాఖ కమిషనర్ యోగితాతో పాటు ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
కరోనా పట్ల అప్రమత్తంగా ఉన్నామని... అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో మరో రెండు థర్మల్ స్కానర్లను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. కరోనా వైరస్ను పరీక్షిచేందుకు మరో రెండు రక్తపరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాజీవ్ గౌబా దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైనన్ని ఎన్ 95 మాస్కులు కూడా సరఫరా చేయాలని కేంద్రాన్ని సీఎస్ కోరారు.
ఇదీ చూడండి : గాంధీలో కోలుకున్న కరోనా బాధితుడు..!