ETV Bharat / state

ఉల్లిపై కేంద్రం నిషేధం.. ఆందోళనలో రైతులు

author img

By

Published : Sep 17, 2020, 5:02 AM IST

కేంద్రం ఉల్లిపై నిషేధం విధించింది. ఎగుమతులుగా దేశందాటే అన్ని ఉల్లిగడ్డలను ఎక్కడికక్కడే ఆపేయాలని ఆదేశించింది. తక్షణమే నిర్ణయం అమలు చేయాలని కూడా... స్పష్టం చేసింది. దేశీయ మార్కెట్లో ఉల్లి లభ్యతను పెంచడానికే ఈ నిర్ణయమని కొన్నివర్గాలు.. ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికేనంటూ మరికొన్ని వాదనలు. మొత్తంగా ఉన్నపళంగా ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఉల్లిపై కేంద్రం నిషేధం.. రైతుల్లో ఆందోళన

గతేడాది ఉల్లి సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ముందు జాగ్రత్తల్లో భాగంగా ఉల్లి ఎగుమతిపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉల్లి ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. కారణాలేవైనా... కొన్నేళ్లుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉల్లి సంక్షోభం మరోసారు ముంచుకొస్తుందన్న అనుమానాల నేపథ్యంలో... కేంద్రం నిషేధ నిర్ణయం తీసుకుంది.

టోకు మార్కెట్..

టోకు మార్కెట్‌లో ఉల్లి ధరలకు రెక్కలు రావడం వల్ల అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం విదేశాలకు వాటి ఎగుమతులు వెంటనే ఆపేయటమే ఉత్తమ మార్గమని భావించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఉల్లిగడ్డలను ఎగుమతి చేయరాదంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ధరలు పైపైకి..

ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉల్లి గడ్డల ధరలు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ. 40 దాటేసింది. గతేడాది ఉల్లి ధర ఇదే సమయంలో కేజీ రూ. 40 నుంచి 100కు పెరిగింది. ఒకానొక దశలో ధర ఏకంగా రూ. 150కు చేరింది. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను కేంద్రం ఎగుమతులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలతో ఉల్లి పంటలపై తీవ్ర ప్రభావం పడగా.. కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

తగ్గిన దిగుబడి..

కొన్ని రోజులుగా దేశంలో విస్తారంగా వర్షాలు కూరుతున్న నేపథ్యంలో దేశంలో ఉల్లిపంట దిగుబడి బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో.. పోటెత్తిన వరదల వల్ల చాలా వరకూ పంట దెబ్బతింది. ఫలితంగా ఉల్లిగడ్డల సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనిని తమకు అనువుగా మలుచుకునేందుకు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి ఉల్లిధరలు పెంచేస్తున్నారు. మరికొందరు విదేశాలకు ఉల్లిగడ్డలను ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉల్లిపాయల ధరలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందంటున్నాయి ప్రభుత్వం వర్గాలు.

తగినంత లేని ఉల్లి సరఫరా..

ప్రస్తుతం దేశంలో డిమాండ్‌కు తగినంతగా ఉల్లి సరఫరా లేకపోవడం వల్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అందుకే అన్ని రకాల ఉల్లిగడ్డల ఎగుమతులపైనా నిషేధం విధించింది. దేశీయంగా రిటైల్‌ వ్యాపారులు, టోకు వ్యాపారుల వద్ద నిల్వల పరిమితిపైనా ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం ప్రకారం టోకు వ్యాపారుల వద్ద 500 క్వింటాళ్లు, రిటైల్‌ వ్యాపారుల వద్ద 100 క్వింటాళ్లు మాత్రమే నిల్వ ఉండాలని పేర్కొంటూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ ఆదేశాలు జారీచేసింది. కృత్రిమ కొరతను నివారించి, బహిరంగ మార్కెట్‌లో ఉల్లిగడ్డల ధరలు పెరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కేంద్రం జారీ చేసిన నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవడంతోపాటు .. అనైతికంగా నిల్వలు కొనసాగిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

అదుపులోకి ధరలు!

అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో.. ధరలు అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వద్ద గల నిల్వల నుంచి 50 వేల టన్నుల ఉల్లిగడ్డలను బహిరంగ మార్కెట్‌లోకి విడుదల చేసింది. కేంద్ర నిల్వల నుంచి తమ అవసరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లిని కొనుగోలు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాసవాన్‌ కోరారు. ఈ నేపథ్యంలో.. దిల్లీ, పంజాబ్‌ సహా పలు రాష్ట్రాలు ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల తరుపున ఉల్లిగడ్డలను వినియోగదారులకు విక్రయిస్తున్నారు. అయితే, ఆగస్టులోనే ధరలను తగ్గించి వినియోగదారుల డిమాండ్‌కు తగినట్లుగా ఉల్లి అందుబాటులోకి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టన్ను ఉల్లి గడ్డలను రూ. 59వేల 932ల కనీస ఎగుమతి ధరకు ఎగుమతి చేయాలని ఆంక్షలు విధించింది. దీని ప్రకారం కొంత మేరకు ఎగుమతులు తగ్గినా.. ఆగడం లేదు.

రైతుల ఆందోళన..

అయితే కేంద్రం నిర్ణయం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా.. దేశంలో ఉల్లి సంక్షోభాలు ఏర్పడుతున్న నేపథ్యంలో.. రైతులు డిమాండ్‌ను అందిపుచ్చుకుంటే లాభాలు గడించివచ్చన్న ఆశతో... భారీగా ఉల్లి సాగుచేశారు. ముఖ్యంగా మహరాష్ట్ర ఏళ్లుగా ఉల్లికి కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఖర్చులు ఎక్కువైనా.. వెనకాడకుండా ఉల్లిపంటపై పెట్టుబడులు పెట్టారు. తీరా పంట ఏపుగా పెరిగిన దశలో వర్షాలు, వరదలు తీవ్రంగా ఇబ్బందిపెట్టాయి. చాలా చోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ పరిస్థితుల్లో.. మిగిలిన పంటైనా ఎగుమతి చేసి నష్టాన్ని భర్తీ చేసుకుందామని భావించారు. దేశీయ మార్కెట్లో అమ్మినదానికంటే.. విదేశాలకు ఎగుమతి చేస్తే ఎక్కువగా గిట్టుబాటు అవుతుంది. కానీ కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించటం వల్ల ఉల్లిరైతులు ఆందోళన బాటపట్టారు.

భగ్గుమంటున్న ధరలు..

ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకూ పెరుగుతూ మళ్లీ సామాన్యులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉల్లి ఉత్పత్తి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఉల్లి కొరత ఏర్పడింది. మరోమారు సంక్షోభం ముందు నిలిచింది. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎగుమతులు కొనసాగితే.. దేశంలో మరో ఉల్లి-లొల్లి ఏర్పడి ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ఎందుకంటే గతంతో పోలిస్తే దేశంలో ఉల్లి వినియోగం పెరిగింది. అన్ని రాష్ట్రాల్లో స్థానికంగా ఉల్లి దిగుమతులు తగ్గాయి. లాక్‌డౌన్‌ అనంతరం ప్రతి నెల ఉల్లి వినియోగం పెరుగుతూ వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో ఉల్లి దిగుమతులు మార్కెట్‌కు తక్కువగా వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కమీషన్‌ ఏజెంట్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు ఉల్లిని నిల్వ చేయడం, లేదా కృత్రిమ కొరత సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. ఉల్లి ధరలు నియంత్రించడానికి వారు ప్రయత్నిస్తున్నారు.

వ్యత్యాసాలు..

మొత్తంగా వర్షాలతో మార్కెట్‌కు డిమాండ్‌కు తగ్గ సరఫరా కాకపోవడంతో ఉల్లి ధరలు పెరిగాయని మార్కెట్‌ అధికారులు అంటున్నారు. దిగుమతులు తగ్గడంతోనే ధరలు పెరిగాయని హోల్‌సెల్‌ వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో.. కిలో ఉల్లి.. రిటైల్‌ మార్కెట్‌లో రూ. 40 నుంచి 50 మధ్య పలుకుతోంది. కొన్ని చోట్ల ఇది మరింత ఎక్కువగా ఉంటోంది. వారం రోజుల వ్యవధిలోనే... హోల్‌సేల్‌ ధరల్లో భారీగా వ్యత్యాసాలు వచ్చాయి.

ఇదీ చూడండి: అలర్ట్: రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.