ETV Bharat / state

'భావనపాడు’ పై కేంద్రం అభ్యంతరాలు

భావనపాడు ఓడరేవు నిర్మాణపనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం పంపిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక పై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పర్యావరణ, అటవీశాఖకు ఏపీ సర్కారు మరోసారి నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

center-objections-on-bhavnapaadu-port-in-Srikakulam-district
'భావనపాడు’ పై కేంద్రం అభ్యంతరాలు
author img

By

Published : Dec 21, 2020, 12:38 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదించిన భావనపాడు పోర్టు (ఓడరేవు) నిర్మాణపనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం పంపిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)పై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ (ఎంవోఈఎఫ్‌) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అవసరం లేకున్నా తీసుకున్న మూడు ఆవాసాలను భూసేకరణ నుంచి మినహాయిస్తారని, దాంతో డీపీఆర్‌లో రూ.1,500 కోట్ల వ్యయం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు ప్రతిపాదనలు మార్చి మళ్లీ పంపాలి. దీనివల్ల టెండర్లలోనూ జాప్యం జరుగుతుందని అంటున్నారు.

ఏపీలో మూడు రేవులను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించింది. దీనికోసం ఎస్పీవీలను ఏర్పాటుచేసింది. పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వ హామీతో రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం మారిటైం బోర్డుకు కల్పించింది. మూడు రేవుల నిర్మాణానికి రైట్స్‌ సంస్థ రూపొందించిన డీపీఆర్‌లను ఆమోదించింది. ఇందులో రామాయపట్నం, భావనపాడు రేవులను ఈపీసీ విధానంలో నిర్మించటానికి కాంట్రాక్టు సంస్థల ఎంపిక కోసం టెండర్లను పిలిచింది.

* ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం రేవు మొదటి దశను రూ.2,646.84 కోట్లతో చేపట్టాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ మారిటైం బోర్డు 2020-21 ప్రామాణిక ధరల ప్రకారం టెండర్లను పిలిచింది. ఈ నెల 15 నాటికి టెండర్ల దాఖలు గడువు ముగిసినా.. ఎక్కువ మంది గుత్తేదారులకు అవకాశం కల్పించటానికి 28 వరకు పొడిగించారు. గడువు ముగిశాక నిర్మాణ సంస్థను ఎంపిక చేసి, పది రోజుల్లోగా లెటర్‌ ఆఫ్‌ ఆథరైజేషన్‌ (ఎల్‌వోఏ) జారీచేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

* శ్రీకాకుళంలోని భావనపాడు రేవు మొదటి దశను రూ.2,573.15 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. నాలుగు బహుళ వినియోగ బెర్తులు, డ్రెడ్జింగ్‌ పనులు, ఇతర మౌలిక సదుపాయాలు ఇందులో వస్తాయి. పునరావాస భారాన్ని తగ్గించుకోవడానికి సుమారు కి.మీ. దూరాన్ని తగ్గించాలని భావిస్తున్నారు. ఇలా చేస్తే మూడు ఆవాసాలను ఖాళీ చేయాల్సిన అవసరం ఉండదు.

* మచిలీపట్నం రేవు అభివృద్ధికి రూ.5,835 కోట్లతో రైట్స్‌ సంస్థ రూపొందించిన డీపీఆర్‌ను ఇప్పటికే ఆమోదించింది. సరకు రవాణాకు నాలుగు బెర్తులు, బొగ్గు, కంటైనర్‌ రవాణాకు ఒక్కో బెర్తును ఏర్పాటు చేయాలి. 800 ఎకరాల్లో రేవును అభివృద్ధి చేస్తారు. నిర్మాణ వ్యయంలో రూ.వెయ్యి కోట్లను ప్రభుత్వం సమకూరిస్తే.. మిగిలిన మొత్తాన్ని ఏపీ మారిటైం బోర్డు రుణాల ద్వారా సమకూర్చుకోవాలి.

ఇదీ చదవండి:

వందేళ్ల తర్వాత రాష్ట్రంలో భూముల సర్వే..నేడు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.