ETV Bharat / state

SEAPLANE SERVICE: లాహిరి లాహిరి లాహిరిలో..! ఇక జలవిమానయానం - తెలంగాణ 2021 వార్తలు

ఇన్నాళ్లూ నదులు, జలాశయాల అందాలను తిలకించాలంటే... కేవలం పడవల్లో మాత్రమే ప్రయాణం చేసేవాళ్లం. కానీ ఇకమీదట ఆకాశంలో రివ్వు రివ్వుమని ఎగిరే విమానమొక్కి నీటి మీద ప్రయాణించబోతున్నాం. తెలంగాణలోని నాగార్జునసాగర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజి వద్ద ఈ వెసులుబాటు కల్పించబోతున్నారు.

center-approves-construction-of-water-aerodromes-at-prakasam-barrage-nagarjunasagar
లాహిరి లాహిరి లాహిరిలో..! ఇక జలవిమానయానం
author img

By

Published : Aug 1, 2021, 6:32 AM IST

తెలుగు రాష్ట్రాల పర్యాటకం త్వరలో జల విమాన కళను సంతరించుకోనుంది. తెలంగాణలోని నాగార్జునసాగర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజి వద్ద వాటర్‌ ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. నీళ్లపై తేలియాడే విమానాల్లో ప్రయాణించే సౌలభ్యం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొద్ది ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. ఆ జాబితాలో ఇటీవల మన దేశం చేరింది. పర్యాటకులను ఆకట్టుకోవడంలో ‘సీ ప్లేన్స్‌’ కీలక భూమిక పోషిస్తాయని భావిస్తున్న కేంద్రం.. తొలిదశలో దేశంలోని 14 ప్రాంతాల్లో వాటర్‌ ఏరోడ్రోమ్‌లను నిర్మించాలని నిర్ణయించింది. అందులో మొదటిది అహ్మదాబాద్‌లోని సబర్మతి నదిపై నిర్మించింది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలు ఈ జాబితాలో చేరనున్నాయి.

అహ్మదాబాద్‌లో త్వరలో అధ్యయనం...

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి నదిపై నిర్మించిన దేశంలోని తొలి వాటర్‌ ఏరోడ్రోమ్‌ పని తీరుపై అధ్యయనం చేయాల్సిందిగా పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను తాజాగా కోరింది. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖలు రాసింది. రాష్ట్రాల బృందంలో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు కూడా ఉండనున్నారు. ఈ బృందం త్వరలో అహ్మదాబాద్‌లో సేవలపై అధ్యయనం చేయనుంది. అనంతరం కావాల్సిన సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన మీదట రాష్ట్రాలతో తుది ఒప్పందం చేసుకొని ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించనున్నారు. ఉడాన్‌ పథకం కింద జల విమానాలను నడిపేందుకు 2017లోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సుముఖత వ్యక్తంచేశాయి. నాగార్జునసాగర్‌ వద్ద ఏరోడ్రోమ్‌ నిర్మాణానికి అనువుగా ఉన్నట్లు ఇప్పటికే సముద్ర విమాన సేవలను అందిస్తున్న స్పైస్‌జెట్‌ పేర్కొంది.

20 సీట్ల సామర్థ్యం...

నీటిపై ప్రయాణించే విమానాల్లో ఒక్కో ట్రిప్‌కు సిబ్బందితో కలిపి 20 మంది ప్రయాణించేందుకు వీలుంటుంది. ఈ విమానాలు నీటి పైన, గాలిలోనూ ఎగురుతాయి. సాధారణ విమానాలకు భిన్నంగా ఎక్కడైనా దిగుతాయని పౌర విమానయాన మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు.

ఇదీ చూడండి: యువతి తీరని కోరిక.. ఎమ్మెల్యే భలే రిప్లై!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.