చరవాణీలు చోరీ చేస్తోన్న ఐదుగురు దుండగులను హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 8 లక్షల విలువ చేసే 52 సెల్ఫోన్లు, 3 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతానికి చెందిన చిన్నా అలియాస్ హరిప్రసాద్, తాండూరుకు చెందిన శ్రీనివాస్, కర్నూలుకు చెందిన కిశోర్ ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాలపడుతున్నారని పోలీసులు తెలిపారు.
మరో ఇద్దరు మైనర్ పిల్లలను కలుపుకుని ముత్తంగిలో నివాసముంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో రద్దీగా ఉన్న ప్రదేశాల్లో సెల్‌ఫోన్ చోరీకి పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చందానగర్, నార్సింగ్, మెదక్ జిల్లా జోగిపేట్, సంగారెడ్డి పఠాన్‌చెరు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు విచారణలో వెల్లడించారని తెలిపారు. గతంలోనూ వీరిపై పలు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయని వివరించారు.