చరవాణీలు చోరీ చేస్తున్న ఝార్ఖండ్‌కు చెందిన ఐదుగురిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. జనంతో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని సెల్ఫోన్లను ఎత్తుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 14 సెలఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ట్రేసింగ్ విధానం ద్వారా రికవరీ చేసిన మరో 51 సెల్ఫోన్లను... బాధితులకు అందజేసినట్లు పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరించారు. నిందితులు జార్ఖండ్ నుంచి నగరానికి వలసవచ్చి బాలానగర్‌లో అద్దెకు ఉంటూ చోరీలకు పాల్పడుతున్నారని డీసీపీ పేర్కొన్నారు.
నిందితులు గోలు కుమార్, కిషన్ కుమార్, బిన్సు కుమార్, శేఖర్ కుమార్‌తోపాటు ఓ బాలుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ ముఠాపై ఇప్పటికే పలు ఠాణాల్లో కేసులు నమోదైనట్లు డీసీపీ వివరించారు.
ఇదీ చూడండి: దొంగతనం చేస్తూ దొరికారు.. చావు దెబ్బలు తిన్నారు...