ETV Bharat / state

దివికేగిన నటశేఖరుడు.. నివాళులర్పించిన గవర్నర్, ఏపీ సీఎం జగన్, రాజకీయ ప్రముఖులు - GOVERNOR TRIBUTES TO KRISHNA

Politicians tribute to Super Star Krishna : సూపర్‌స్టార్‌ కృష్ణకు నివాళి అర్పించేందుకు పద్మాలయ స్టూడియోకు తెలుగు సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు తరలివచ్చారు. తన నటనాకౌశలంతో అలరించిన దిగ్గజం తమను వదిలి వెళ్లారని తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు.. మహేశ్‌బాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు.

SUPERSTAR
SUPERSTAR
author img

By

Published : Nov 16, 2022, 1:26 PM IST

Politicians tribute to Super Star Krishna : చిరునవ్వుతో పలకరించే సూపర్‌స్టార్‌ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని సినీ, రాజకీయ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సూపర్ స్టార్ కృష్ణకు నివాళులర్పిస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు

Governor Tamilisai tribute to Super Star Krishna : లెజెండరీ నటుడు కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ గవర్నర్‌ తమిళ సౌందరాజన్‌ నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకున్న ఆమె పుష్పాంజలి ఘటించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం నిజంగా షాక్‌కు గురి చేసిందన్నారు. తన నటనతో అశేష ప్రేక్షకులను అలరించారని చెప్పారు. సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలు మరువలేమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్థివదేహానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ అంత్యక్రియల ఏర్పాట్లు అక్కడే ఉండి చూసుకుంటున్నారు. సాయంత్రం మ. 3 గం.కు అంతిమయాత్ర, సా. 4 గం.కు మహప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

AP CM JAGAN TRIBUTES TO KRISHNA : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ పార్థివదేహాన్ని సందర్శించారు. పూలమాలలతో భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనతో పాటు మంత్రి గోపాలకృష్ణ, ఎంపీ భరత్‌.. నటశేఖరుడికి అంజలి ఘటించారు. అనంతరం కృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్‌.. ధైర్యంగా ఉండాలంటూ వారిని వెన్నుతట్టి ఓదార్చారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

BALAKRISHNA FAMILY TRIBUTES TO SUPERSTAR : నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధర, కుమార్తె బ్రహ్మిణి… సూపర్​స్టార్​ కృష్ణకు పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి.. మహేశ్ బాబుకు ధైర్యం చెప్పారు. చలనచిత్ర రంగానికి ఎనలేని సేవలందించిన నటశేఖరుడు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

"కృష్ణ మన మధ్య లేరన్న వార్త బాధాకరం. ప్రయోగాలకు మారుపేరు సూపర్‌స్టార్‌ కృష్ణ. చలనచిత్ర రంగానికి ఎనలేని సేవలందించారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా మంచి సినిమాలు చేశారు. సాంఘిక, జానపద, చారిత్రక చిత్రాల్లో నటించి మెప్పించారు. కొత్త నిర్మాతలు, దర్శకులను ప్రోత్సహించేవారు. ఎన్టీఆర్‌ మాదిరిగానే కృష్ణ కూడా నిర్మాతల పాలిట కల్పవృక్షం. చలనచిత్ర పరిశ్రమ బాగుండాలని ఎప్పుడూ కోరుకునేవారు"-బాలకృష్ణ

LEADERS TRIBUTES TO SUPERSTAR : సూపర్​స్టార్​ కృష్ణ పార్థివదేహానికి రాజకీయ ప్రముఖులు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఘన నివాళులు అర్పించారు. నటశేఖరుడి పార్థివదేహానికి తెదేపా నేతలు సోమిరెడ్డి, ఎంపీ కనకమేడల పలువురు నాయకులు అంజలి ఘటించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.