కరోనా వైరస్‌పై సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని క్రీడాకారుణిలు పీవీ సింధు, సానియా మీర్జా వీడియోలను విడుదల చేశారు. కరోనా వ్యాప్తి పట్ల జాగ్రతగా ఉండాలని సూచిస్తూ మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్ వీడియోలను విడుదల చేశారు.
ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరచుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. కరోనా పట్ల భయపడాల్సిన అవసరం లేదని.. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని కోరారు.
ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి-ఎస్పీఓ సహా ఇద్దరు మృతి