ETV Bharat / state

'పరిస్థితులను అంచనాలు వేస్తూ... నిర్ధరణ పరీక్షలు పెంచాలి' - అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ

భారత్​లో లాక్​డౌన్ ఫలితాన్నిచ్చిందని... అయినా సరే జాగ్రత్తలు అవసరమని సీడీసీ, యూఎస్​ఏఐడీ ప్రతినిధులు పేర్కొన్నారు. లాక్​డౌన్​ సడలింపుల కారణంగా... పరిస్థితులను అంచనా వేస్తూ... నిర్ధరణ పరీక్షలను పెంచాల్సిన అవసరం కూడా ఉందని సూచించారు.

cdc-and-usaid-about-lock-down-and-corona-tests
'పరిస్థితులను అంచనాలు వేస్తూ... నిర్ధరణ పరీక్షలు పెంచాలి'
author img

By

Published : May 20, 2020, 12:20 PM IST

కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా దేశంలో అమలు చేసిన లాక్‌డౌన్‌ మంచి ఫలితాన్నే ఇచ్చిందని, దశల వారీగా లాక్‌డౌన్‌ను సడలిస్తున్న తరుణంలో మరింత అప్రమత్తత అవసరమని వ్యాధి నియంత్రణ-నివారణ కేంద్రం(సీడీసీ), అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్‌ఏఐడీ) భారతీయ ప్రతినిధులు పేర్కొన్నారు. వైరస్‌ మరోదఫా ప్రకోపించే(రీ బౌన్స్‌ అయ్యే) ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. సడలింపుల తర్వాత పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ నిర్ధరణ పరీక్షలను పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. వైరస్‌పై భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి అమెరికా సంపూర్ణ మద్దతు ఇస్తోందని భారత్‌లో సీడీసీ మిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మేఘనా దేశాయ్‌, యూఎస్‌ఏఐడీ డైరెక్టర్‌ రామోన్‌ ఎల్‌ హమ్జౌయి వివరించారు.

60 దేశాల్లో పరిశోధనలు

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ రూపొందించే విషయంలో ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలు విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్నాయి. టీకా త్వరలో వస్తుందన్న ఆశాభావంతో ఆయా దేశాలు ఉన్నాయి. భారతదేశంలో వివిధ సంస్థలు చేస్తున్న పరిశోధనలకు అమెరికా సహకారాన్ని అందిస్తోంది.

ఇప్పుడే అసలు పరీక్ష

లాక్‌డౌన్‌ను సడలిస్తుండటంతో ప్రజలు, ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వానికి 200 వెంటిలేటర్లు ఉచితంగా అందచేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇందులో తొలి విడతగా 50 వెంటిలేటర్లు వచ్చే వారంలో వస్తాయి. మిగిలినవి కూడా త్వరలోనే భారత ప్రభుత్వానికి అందజేస్తామని.... ఇవి పూర్తిగా అమెరికాలో తయారైనవి, అత్యాధునికమైనవని వెల్లడించారు.

11 వేల మంది వైద్యులకు శిక్షణ

వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో జనవరి నుంచి దేశంలోని 22 రాష్ట్రాలకు చెందిన 11 వేల మంది వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. కరోనాపై పోరాటానికి 900 మిలియన్‌ డాలర్లను అమెరికా ప్రభుత్వం కేటాయించింది. భారతదేశానికి 5.9 మిలియన్‌ డాలర్లు కేటాయించాం’ అని ఆ ప్రతినిధులు వివరించారు.

ఇవీ చూడండి: జూన్ 1 నుంచి సాధారణ రైళ్ల సేవలకు గ్రీన్​సిగ్నల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.