ETV Bharat / state

మహేష్​బాబు తల్లి మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం - బాలకృష్ణ సంతాపం

ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి, మహేశ్​బాబు మాతృమూర్తి మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఆమె మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఇందిరాదేవి మరణం పట్లు హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్​ సంతాపం తెలిపారు.

CBN, NARA LOKESH AND PAWAN, BALKRISHNA condolences-on-the-death-of-indira-devi
మహేష్​బాబు తల్లి మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం
author img

By

Published : Sep 28, 2022, 10:24 AM IST

ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ బాధ నుంచి త్వరగా కోలుకునే మానసికశక్తిని కుటుంబ సభ్యులకు అందించాలని భగవంతుని ప్రార్థిస్తూ.. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

  • ప్రముఖ నటులు కృష్ణగారి సతీమణి, మహేష్ బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవిగారి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఈ బాధ నుండి త్వరగా కోలుకునే మానసికశక్తిని కుటుంబ సభ్యులకు అందించాలని భగవంతుని ప్రార్థిస్తూ...ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/9EGjusSKGA

    — N Chandrababu Naidu (@ncbn) September 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లోకేశ్​ సంతాపం: ప్రముఖ నటులు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేసారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నా అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • ప్రముఖ నటులు, సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి ఇందిరాదేవి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/oAZlHNKR3l

    — Lokesh Nara (@naralokesh) September 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాలకృష్ణ సంతాపం: ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణం బాధాకరమని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పవన్​కల్యాణ్​: మహేశ్​బాబు మాతృమూర్తి ఇందిరాదేవి తుదిశ్వాస విడిచారనే విషయం విచారం కలిగించిందని జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్​ అన్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇందిరాదేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. విజయనిర్మలతో పరిచయం అయ్యాక కృష్ణ ఇందిరాదేవికి విడాకులిచ్చారు. ఆ తర్వాత మహేశ్ బాబు వద్దనే ఉంటున్నారు ఇందిరా దేవి. మహేశ్​ బాబు కుటుంబ సభ్యులకు పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.