ETV Bharat / state

'కొండంత ప్రచారం చేసి.. గోరంత కూడా ఇవ్వలేదు' - ap news

ఏపీలో వైకాపా ప్రభుత్వం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని.. తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కొండంత ప్రచారం చేసి ముస్లింలకు గోరంత సాయం కూడా చేయలేదని దుయ్యబట్టారు. రంజాన్ సందర్భంగా మతపెద్దలు, ముస్లింలతో ఆన్​లైన్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు... వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ap news
చంద్రబాబు నాయుడు
author img

By

Published : May 14, 2021, 10:13 PM IST

ముస్లింల అభివృద్ధిని ఏపీ సీఎం జగన్‌ గాలికొదిలేశారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని ఆక్షేపించారు. రంజాన్ సందర్భంగా... ముస్లిం మతపెద్దలు, ముస్లిం సోదరులతో ఆన్​లైన్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు... వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ సీఎం జగన్ వక్ఫ్ బోర్డు ఆస్తులను అన్యాక్రాంతం చేయటంతో పాటు ఇమామ్​లకు ఇచ్చే గౌరవ వేతనం, పెళ్లి కానుక రద్దు చేశారని ధ్వజమెత్తారు. తెదేపా హయాంలో ముస్లింల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. ప్రజల ప్రాణాలు కాపాడకుండా ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసం అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ఎండగట్టిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ప్రభాకర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు.

ఇదీ చూడండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.