CBI to investigate Kavita in Delhi liquor scam: ఎమ్మెల్సీ కవిత ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. రేపు కవిత స్టేట్‌మెంట్‌ను సీబీఐ తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే.. కవిత... ప్రగతిభవన్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్‌తో ఈ విషయమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయం ఉందని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు నోటీసులు సైతం జారీ చేసింది. 6వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు.
Delhi liquor scam updates: అయితే దీనిపై స్పందించిన కవిత.. సీబీఐకు లేఖ రాశారు. ఈ నెల 11, 12, 14, 15వ అందుబాటులో ఉంటానని వెల్లడించారు. దీనిపై స్పందించిన సీబీఐ ఈ నెల 11న విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు వాంగ్మూలం నమోదు చేస్తామని అధికారులు రిప్లై ఇచ్చారు. దీంతో రేపు సీబీఐ అధికారులు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ఆమె నివాసంలోనే కవితను ప్రశ్నించనున్నారు.
మరోవైపు కవిత నివాసం వద్ద భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. రోడ్డుకు ఇరువైపుల హోర్డింగ్స్, బ్యానర్స్‌లను భారీఎత్తున బీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారు. కవితను ఉద్దేశిస్తూ... 'డాటర్ ఆఫ్ ఫైటర్.. విల్ నెవర్ ఫియర్' అని బ్యానర్లపై రాశారు.

ఇవీ చదవండి: