ETV Bharat / state

నకిలీ మెడికల్​ సర్టిఫికెట్లు స్కామ్​.. తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు - మెడికల్​ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం సీబీఐ సోదాలు

CBI searches across india in case of fake medical certificates: నకిలీ మెడికల్​ సర్టిఫికెట్లు పొందిన వ్యక్తుల వివరాలను తెలుసుకునేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా 91 చోట్ల సోదాలను నిర్వహించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తులపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.

cbi
సీబీఐ
author img

By

Published : Dec 29, 2022, 7:48 PM IST

CBI searches across india in case of fake medical certificates: నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ నంబర్ల వ్యవహరంలో దేశ వ్యాప్తంగా 91 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. విదేశాల్లో ఎంబీబీఎస్​ చదివి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షలో ఫెయిల్ అయినా.. 73మంది విద్యార్దులు సర్టిఫికెట్లు పొందారు. పలు స్టేట్ మెడికల్ కౌన్సిల్​లో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో సర్టిఫికెట్లు పొందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సునీల్​ కుమార్ గుప్తా ఫిర్యాదుతో ఈనెల 21న సీబీఐ కేసు నమోదు చేసింది. సెక్షన్ 420, 467, 468,471 సహా పలు సెక్షన్లు నమోదు చేయడం జరిగింది.

తెలంగాణకు చెందిన ముగ్గురు, ఏపీకి చెందిన ఇద్దరు ఫారెన్ గ్రాడ్యుయేట్లను సైతం ఎఫ్‌ఐఆర్​లో చేర్చింది. బిహార్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ సర్టిఫికెట్ పొందిన వరంగల్ కాజీపేటకు చెందిన గుడిమళ్ల రాకేశ్​ కుమార్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ పొందిన చేవెళ్లకు చెందిన సితాలె శ్రీనివాసరావు, రాజస్థాన్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ పొందిన బాగ్​ లింగంపల్లికి చెందిన బొమ్మిరెడ్డి హరికృష్ణ రెడ్డి, బిహార్ మెడికల్ కౌన్సిల్ నుంచి నకిలీ సర్టిఫికెట్ పొందిన విశాఖపట్నంకు చెందిన గొర్ల వెంకట్ రాజా వంశీ, విజయవాడ కొత్త పేటకు చెందిన మారుపిళ్ల శరత్ బాబును ఎఫ్‌ఐఆర్​లో చేర్చింది.

నకిలీ సర్టిఫికెట్లు పొందిన వారి ఇళ్లు.. సర్టిఫికెట్లు జారీ చేసిన ఆయా మెడికల్ కౌన్సిల్​లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు చేసి పలు కీలక డాక్యుమెట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా 15 మెడికల్ కౌన్సిళ్ల పేర్లను సీబీఐ ఎఫ్‌ఐఆర్​లో పొందుపరిచింది. అర్హత లేకున్న నకిలీ మెడికల్ కౌన్సిళ్ల సర్టిఫెకెట్లు పొందిన విద్యార్ధులు ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు సీబీఐ గుర్తించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.