బ్యాంకును మోసం చేశారన్న అభియోగం హైదరాబాద్‌లోని క్యోరీ ఓరేమన్ లిమిటెడ్ కంపెనీతో పాటు.. సంస్థ డైరెక్టర్లపై సీబీఐ.. కేసు నమోదు చేసింది. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 2013-2016 మధ్య నిందితులు మోసపూరితంగా రుణం పొందినట్లు ఫిర్యాదు నమోదైంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జోనల్ మేనేజర్ దివేశ్ దినకర్ ఫిబ్రవరిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇవాళ సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ అమీర్ పేటలోని క్యోరీ ఓరేమన్ లిమిటెడ్, సంస్థ డైరెక్టర్లు ఇషూ నారంగ్, చందూలాల్ పటేల్, రుద్రరాజు శ్రీనివాస్ షాతోపాటు.. బ్యాంకు సిబ్బందిపై ఐపీసీ 120బీ, 420 సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఇదీ చూడండి: కరోనా ఔషధం పేరుతో నకిలీ మందులు విక్రయం