న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో తాజాగా మరో ఆరుగురు నిందితులను అధికారులు అరెస్టు చేశారు. అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకటసత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్, కిషోర్ కుమార్, అజయ్ అమృత్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు గతేడాది నవంబర్ 11న దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఈ కేసులో మొత్తం 11మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: TS Inter exams: ఇంటర్ పరీక్షలపై చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు