సీబీఐ అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరిని సీబీఐ అరెస్టు చేసింది. హైదరాబాద్కు చెందిన వై.మణివర్దన్ రెడ్డి, మధురై నివాసి సెల్వం రామరాజు... సీబీఐ, ఈడీ తదితర కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని డబ్బుల కోసం బెదిరిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న గుంటూరులోని ఓ వ్యక్తికి డబ్బులు ఇవ్వాలని సంప్రదించారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగించి.. దిల్లీ సీబీఐ కార్యాలయం ఫోన్ నంబరుతో నిందితుడికి పలుమార్లు ఫోన్లు చేశారు.
ఈనెల 4న వై.మణివర్దన్ రెడ్డి గుంటూరు వెళ్లి నేరుగా నిందితుడిని కలిసి.. భారీగా డబ్బు డిమాండ్ చేసి.. ఇవ్వకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. 16న కేసు నమోదు చేసిన సీబీఐ.... వై.మణివర్దన్ రెడ్డి, సెల్వంరాజును అరెస్టు చేసింది. హైదరాబాద్, చెన్నై, మధురై, శివకాశిలో సోదాలు నిర్వహించి... మొబైల్ ఫోన్లు, వాట్సాప్ సమాచారం స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కోర్టు సిబ్బంది