హైదరాబాద్ కూకట్‌పల్లి కోర్టుకు చెందిన ఇద్దరు సిబ్బంది అనిశా వలకు చిక్కారు. ఆస్తికి సంబంధించిన కేసులో ఫిర్యాదుదారుడి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధించిన ఆస్తి వివాదంలో కోర్టు సిబ్బంది మదన్‌మోహన్, అరుణ్... ఆస్తిని తిరిగి అతనికి అప్పగించే విధంగా సహాయపడుతామంటూ రూ.5 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. కోర్టు సిబ్బంది లంచం తీసుకుంటున్న సమయంలో అనిశా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.