హైదరాబాద్ సైదాబాద్ లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్ నుంచి గణేశ్ చౌరస్తా వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతికి నల్ల జండాలతో శాంతి ర్యాలీ జరిపారు.
మనోజ్ కుమార్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. వారి కుటుంబానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అందరినీ కాపాడే జర్నలిస్టు మిత్రులకే ఇలా అయితే వారిని కాపాడేది ఎవరని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టు మిత్రులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : స్పిన్నింగ్ మిల్లుల సంక్షోభం.. జీతాలు లేక కార్మికుల అవస్థలు