ETV Bharat / state

Chikoti Praveen News : థాయ్​లాండ్​లో 'చీకోటి' గ్యాంబ్లింగ్​పై నిఘా - థాయ్​లాండ్ పోలీసులు

Casino Chikoti Arrested in Thailand: క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ థాయ్​లాండ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆయనతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పోలీసులకు చిక్కారు. దాదాపు రూ.100 కోట్లు విలువ చేసే క్రెడిట్స్​ను అక్కడ పోలీసులు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పక్కా సమాచారం అందడంతో.. ఈ దాడులు నిర్వహించారు. అయితే చీకోటి ప్రవీణ్​పై ఇప్పటికే హైదరాబాద్ ఈడీ అధికారులు ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Casino Chikoti
Casino Chikoti
author img

By

Published : May 2, 2023, 1:56 PM IST

Casino Chikoti Arrested in Thailand: క్యాసినో కేసులో థాయ్​లాండ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్, అతని అనుచరులతో పాటు.. క్యాసినో ఆడేందుకు వెళ్లిన వాళ్లను థాయ్​లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రూ.100 కోట్లు విలువ చేసే క్రెడిట్స్​ను అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్​లాండ్​లోని కోన్ బురి జిల్లా బ్యాంగ్ లా ముంగ్​లో ఉన్న ఓ కన్వెన్షన్ హాల్​లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు కోన్ బురి జిల్లా పోలీస్ ఉన్నతాధికారి కాంపోల్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.

థాయ్​లాండ్​ పోలీసులు క్యాసినో నిర్వహించే వారిపై నిఘా: రూ.లక్షా 60 వేలు నగదు, 92 చరవాణిలు, ఒక ఐపాడ్​తో పాటు.. మూడు ల్యాప్​ టాప్​లు, 25 సెట్ల ప్లే కార్డులు, సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను నేరుగా హైదరాబాద్​కు అనుసంధానం చేసినట్లు థాయ్​లాండ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. క్యాసినో ఆడే వాళ్లపై నిఘా పెట్టేందుకే.. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు థాయ్​లాండ్ పోలీసులు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, చీకోటి ప్రవీణ్ అనుచరుడు మాధవరెడ్డితో పాటు పలువురు తెలుగు వాళ్లు కూడా ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

థాయ్​లాండ్​లోనూ క్యాసినో నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు: అనుమతి లేకుండా క్యాసినో నిర్వహిస్తున్నట్లు థాయ్​లాండ్ పోలీసులు తెలిపారు. చీకోటి ప్రవీణ్​పై ఇప్పటికే హైదరాబాద్ ఈడీ అధికారులు ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోవాలో బిగ్ డాడీ, క్యాసినో పలు రకాల పేకాటలు నిర్వహిస్తున్న చీకోటి ప్రవీణ్.. ఆ తర్వాత శ్రీలంక, నేపాల్, థాయ్​లాండ్​లోనూ క్యాసినో నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి.. ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్లడం, తిరిగి విదేశాల నుంచి ఇక్కడికి డబ్బులు తీసుకువచ్చనట్లు గుర్తించారు. ఇప్పటికే చీకోటి ప్రవీణ్​తో పాటు పలువురిని ఈడీ అధికారులు పిలిచి ప్రశ్నించారు. దీనికి సంబంధించిన దర్యాప్తును ఈడీ అధికారులు కొనసాగిస్తున్నారు.

ఇదీ జరిగింది: థాయ్‌లాండ్‌లో పెద్ద ఎత్తున జరుగుతున్న గ్యాంబ్లింగ్​ను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. పటాయాలోని ఓ లగ్జరీ హోటల్‌లో 93 మంది గ్యాంబ్లర్లను అరెస్టు చేసినట్లు అక్కడి మీడియా ఓ కథనంలో తెలిపింది. అరెస్టయిన వారిలో 83 మంది భారతీయులు ఉండగా.. వారిలో హైదరాబాద్‌కు చెందిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ ఉన్నారు.

Casino Chikoti Praveen Arrest: థాయ్‌లాండ్‌లోని బాంగ్‌ లామంగ్‌ జిల్లాలో ఆసియా పటాయా హోటల్‌లో సోమవారం తెల్లవారుజామున జరిపిన తనిఖీల్లో పోలీసులు ఈ గ్యాంబ్లర్లను అరెస్టు చేశారు. అయితే పోలీసులు హోటల్​లోకి ప్రవేశించిన సమయంలో గ్యాంబ్లర్లు పెద్ద సంఖ్యలో గేమ్​లు నిర్వహిస్తున్నారు. వారిని చూడగానే నిందితులు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వారిని చుట్టుముట్టి.. మొత్తం 93 మందిని అరెస్టు చేయగా.. అందులో 83 మంది భారతీయులు, ఆరుగులు థాయ్​లాండ్​ వాసులు, నలుగురు మయన్మార్​ దేశస్థులు ఉన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.