ETV Bharat / state

ఇదేం తీరు పోలీసన్నా - రక్షించాల్సిన మీరే రాంగ్ రూట్​లోకి వెళితే ఎలాగన్నా?

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 9:17 AM IST

Cases Against Police in Telangana 2023 : ప్రజలకు భద్రత కల్పించాల్సిన కొందరు రక్షకభటులు అడ్డదారి తొక్కుతున్నారు. కాసుల యావలో కుటుంబ, ఆర్థిక వివాదాల్లో తలదూర్చుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీస్ ప్రతిష్ఠకే మచ్చతెస్తున్నారు. నేరస్తులతో ఊచలు లెక్కపెట్టించాల్సిన పోలీసులే నిందితులుగా మారి జైలు పాలవుతున్నారు. ఈ ఏడాది హైదరాబాద్‌ నగర పరిధిలో వివిధ హోదాల్లోని 50 మంది పోలీసులు సస్పెన్షన్‌కు గురవగా ఒకరిని డిస్మిస్‌ చేశారు. మరో ఏడుగురుని సర్వీస్‌ నుంచి తొలగించారు.

Case Files On Police in Telangana
Cases Against the Police

అడ్డదారిలో రక్షక భటులు - హైదరాబాద్‌ పరిధిలో వివిధ హోదాల్లోని 50 మంది పోలీసులు సస్పెన్షన్‌

Cases Against Police in Telangana 2023 : క్రమ శిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీస్‌ శాఖలో కొందరి తీరు కంచే చేను మేసిన చందంగా మారుతోంది. ఉన్నతాధికారుల హెచ్చరికలు, సస్పెన్షన్‌ చర్యలను కొందరు పోలీసులు పెడచెవిన పెడుతున్నారు. ఇంకొందరు బినామీ పేర్లతో స్థిరాస్తి రంగంలో యథేచ్ఛగా దందాలు సాగిస్తున్నారు. మరికొందరు రౌడీషీటర్లు, రియల్‌ ఏజెంట్లతో కలిసి వివాదాస్పద భూములను తక్కువ ధరకు సొంతం చేసుకుంటున్నారు.

సాగర్ వివాదంపై వీడని అనిశ్చితి - తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు

Case Files On Police in Telangana : ఇటీవల హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్‌ కేసులో చిక్కడపల్లి మాజీ డీఐ ప్రసాద్, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఐ ప్రసాద్‌ బాల్య స్నేహితుడు రాజు ఆర్నెళ్ల క్రితం రియల్‌ ఎస్టేట్‌ సంస్థను ఏర్పాటు చేశారు. ఇద్దరు సమాన వాటా పెట్టుబడిగా పెట్టారు. అనంతరం సంస్థలో తన పేరిట ఉన్న వాటాను సోదరుని పేరున రిజిస్ట్రేషన్‌ చేయాలని స్నేహితుడికి సూచించాడు. దీన్ని పట్టించుకోని రాజు పూర్తి వాటా తన పేరునే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు.

Cases Against Police Officers : అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన పెట్టుబడి వెనక్కి ఇచ్చేయమంటూ రాజుపై ఒత్తిడి తెచ్చినా లాభం లేకపోయింది. ఎలాగైనా దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రెండు రోజుల క్రితం ఈసీఐఎల్ వద్ద రాజు ఉన్నాడని తెలుసుకున్న డీఐ ప్రసాద్‌ తన స్నేహితులు షమీ, రామకృష్ణలతో కలిసి అతని వద్దకు వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాజు పంతం వీడకపోవటంతో బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ముగ్గురూ కలిసి అతడిపై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం చిక్కడపల్లి ఠాణాలో కేసు నమోదైంది. శుక్రవారం ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Police Officers Suspended : ఇటీవల మేడ్చల్‌కు చెందిన ఓ ఎస్సై రూ.100 కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు ఏకంగా విశ్రాంత ఉద్యోగిపై విష ప్రయోగం చేయటం సంచలనం సృష్టించింది. నగరానికి చెందిన మరో ఇన్‌స్పెక్టర్‌ మద్యం దుకాణాలు, సివిల్‌ వివాదాల్లో తలదూర్చి డబ్బు డిమాండ్‌ చేయటంతో బదిలీపై వెళ్లాడు. ఈ ఏడాది నగర పరిధిలో వివిధ హోదాల్లోని 50 మంది పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఒకరిని డిస్మిస్‌ చేశారు. ఏడుగురుని సర్వీస్‌ నుంచి తొలిగించారు. అవినీతి నిరోధక శాఖ కేసుల్లో ఆరుగురిపై, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన 19 మందితో పాటు అవినీతి కేసులో ఒకరిపై, క్రిమినల్‌ కేసులు ఉన్న 17 మందిపై, అక్రమాలకు పాల్పడిన మరో 7 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

Hyderabad Police on Investment Frauds : 'క్లిక్‌ చేస్తే.. డబ్బులు వస్తున్నాయంటే ఆలోచించాల్సిందే'

గతంలో 74, నిన్న 50కేసులు.. టీడీపీ నేతలపై పోలీసుల వ్యవహార శైలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.