ETV Bharat / state

Case on Rajasingh: బుల్డోజర్ల వ్యాఖ్యలు... రాజాసింగ్​పై కేసు నమోదు - Ec notices to mla rajasingh

Case on Rajasingh: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్​కు ఓటు వేయాలంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయగా... రాజాసింగ్ స్పందించలేదు. దీంతో ఆయనపై మంగళ్​హాట్​ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది.

Rajasingh
Rajasingh
author img

By

Published : Feb 20, 2022, 3:13 PM IST

Case on Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​పై మంగళ్​హాట్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. తెలంగాణ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర్​ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలు జారీచేసింది.

ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల్లో యోగికి ఓటు వేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఓటర్లను ఉద్దేశిస్తూ రాజాసింగ్ వీడియోను విడుదల చేశారు. ఎన్నికల తరువాత వారిని గుర్తిస్తామని... బుల్డోజర్లు ఎందుకు వాడతారో తెలుసుగా అంటూ వీడియోలో హెచ్చరించారు. ఈ విషయంపై రాజాసింగ్ వివరణ ఇవ్వాలని ఇటీవల ఈసీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా సమాధానమివ్వాలని రాజాసింగ్​కు స్పష్టం చేసింది. గడువులోగా సమాధానం రాకపోవడం వల్ల తెలంగాణ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మంగళ్​హాట్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

MLA Rajasingh News: మరోవైపు తాను ఎలాంటి తప్పు మాట్లాడలేదన్నారు రాజాసింగ్. అఖిలేష్​యాదవ్‌ అధికారంలోకి వస్తే ఏమవుతుంది? యోగీ ఆదిత్యానాథ్​ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది? అనే విషయాలనే ప్రస్తావించానని వివరించారు. అఖిలేష్‌ యాదవ్‌ ప్రభుత్వ హాయంలో హిందువులు, రైతుల భూములను కబ్జాలు చేశారని ఆరోపించారు. కబ్జాలు చేసిన స్థలాల్లో యోగి ప్రభుత్వం పేదలకు లక్షల ఇళ్లు కట్టించిందని.. ఈ విషయాన్నే మాట్లాడానని పేర్కొన్నారు. యోగి ఆదిత్యానాథ్​ మరోసారి ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పంతో రాజస్థాన్​లోని ఉజ్జయినిలో మూడు రోజుల పూజా కార్యక్రమం తలపెట్టినట్టు తెలిపారు.

ఇదీస చూడండి: MLA Raja Singh Response: ఈసీ నోటీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్​ ఏమన్నారంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.