కార్గో బస్సుల ద్వారా కూరగాయలు తరలింపు ప్రక్రియ జరుగుతుండడం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని బోయిన్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్గో సర్వీస్ సేవలు విజయవంతం అయ్యాయని పేర్కొన్నారు.
గురువారం నూతనంగా మెదక్ డిపోకు చెందిన కార్గో సర్వీస్‌ను బోయిన్పల్లి మార్కెట్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. కార్గో బస్సుల ద్వారా కూరగాయల తరలింపుతో పాటు ప్రయాణికులను కూడా తీసుకు వెళ్ళే విధంగా బస్సును రూపొందించినట్లు ఆయన తెలిపారు.
మెదక్ జిల్లా నుంచి వచ్చే కూరగాయలను బోయినపల్లి మార్కెట్ వరకు, అదే విధంగా మార్కెట్ నుంచి కూరగాయలను మెదక్ టౌన్ వరకు వివిధ ప్రాంతాలకు చేర్చేందుకు ఈ సర్వీసులను ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం