ఓటమి అనుకోకుండా... ఒకటీరెండు సార్లు దరఖాస్తు తిరస్కరణకు గురయినంత మాత్రాన అది పూర్తిగా మీ వైఫల్యం అనుకోకూడదు. ఈ మాత్రం దానికే కుంగిపోవడం, మరోచోట అప్లై చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. దీన్ని ఓటమిగా భావించకుండా, ఎలాగైనా సాధించడానికి కృషి చేస్తూనే ఉండాలి. వైఫల్యంతోపాటే విజయం కూడా ఉంటుందని గుర్తిస్తే చాలు. ప్రయత్నం చేయడం దానంతటదే అలవడుతుంది.
నైపుణ్యాలు... ఏ సంస్థకు మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో, దానికి సంబంధించిన పూర్తి అధ్యయనం చేయాలి. ఆ సంస్థ అభివృద్ధి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంతే కాదు, అప్లై చేస్తున్న ఉద్యోగానికి ఎటువంటి నైపుణ్యాలు అవసరమో గుర్తించి, వాటిలో శిక్షణ తీసుకుంటే మంచిది. ఇప్పుడు చాలా కోర్సులను ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే, విజయం మీదే.
దరఖాస్తులో... మీ అనుభవాలను పూర్తిగా పొందుపరచడం మరవకూడదు. గతంలో ఆయా సంస్థల్లో మీరు సాధించిన విజయాలు, పొందిన ప్రశంసల గురించి కూడా చేరిస్తే మీపై అవతలివారికి ఓ నమ్మకం కలుగుతుంది. మీ గురించి తెలుసుకునే వీలుంటుంది. అవకాశమిస్తే, సంస్థ అభివృద్ధిలో మీరు ఎలా భాగస్వాములవుతారన్నది వారికి దరఖాస్తులో వివరించాలి. అప్పుడు విజయావకాశాలు పెరుగుతాయి.
ఇదీ చదవండి: Delta Variant: డెల్టా వైరస్ రెండు నెలల్లో ఎలాగైనా మారొచ్చు!