ప్రజలకు సేవ చేసేందుకే పోలీసులున్నారని... పౌరుల్లో ఆత్మస్థైర్యం, భరోసా నింపేందుకే నిర్భంద తనిఖీలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ మధ్య మండలం పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పటేల్ నగర్లోని పలు బస్తీల్లో మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలో 150 మంది పొలీసులతో తనిఖీలు చేపట్టారు.
ప్రతీ ఇంటిని క్షణ్ణంగా...
ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలతోపాటు నలుగురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు వారి పూర్తి వివరాలు, ఆధారాలు చూసిన తర్వాతే అద్దెకివ్వాలని యాజమానులకు సూచించారు. ప్రజలతో అవినాభావ సంబంధాలు మెరుగుపర్చడం కోసమే ఈ నిర్భంద తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలు కూడా సహాకారం అందిస్తున్నట్లు డీసీపీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి : ప్రేమించిన వ్యక్తితో పెళ్లికోసం మౌన పోరాటం