ETV Bharat / state

జీవితాల్లో.. 'కారు'చీకట్లు! - రోడ్డు ప్రమాదాలు తాజా వార్త

ఒకటి మరిచిపోక ముందే మరొకటి.. వరుస కారు ప్రమాదాలు హైదరాబాద్​ నగరవాసులకు దడ పుట్టిస్తున్నాయి. వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డెక్కాల్సి వస్తోంది. ఒక్క ఆదివారమే కారు ప్రమాదాల వల్ల నలుగురు చనిపోగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. మిగతా ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తు, అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్​ చేయడం ఇలా కారణాలెన్నైనా ప్రమాదాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.

Car accidents in the hyderabad city in just one Sunday four persons dead and nine persons injured
జీవితాల్లో.. కారుచీకట్లు!
author img

By

Published : Feb 24, 2020, 12:51 PM IST

వరుస ఘటనలతో ఏ వైపు నుంచి ప్రమాదం దూసుకొస్తుందో తెలియక నగరవాసులు జంకుతున్నారు. శనివారం అర్ధరాత్రి 1.50 గంటలు కర్మన్‌ఘాట్‌ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టి 100 అడుగుల దూరంలో ఉన్న రెండు ద్విచక్రవాహనాలను ధ్వంసం చేసింది. అంటే.. ఎంత వేగంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగినందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కొన్ని గంటల తర్వాత మరో కారు బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 3లో బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఓ టిఫిన్‌ సెంటర్‌ ప్రహరీని ఢీకొట్టింది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

పిట్టగోడ ఎక్కిన కారు

ప్రమాదం: కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే పిట్ట గోడ ఢీకొంది.

ఎక్కడ: బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 2

తీవ్రత: కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో ఎవరికీ ఏమీ కాలేదు.

హయత్‌నగర్‌ వద్ద...

ప్రమాదం: బైక్‌ను ఢీకొట్టిన లారీ

తీవ్రత: ద్విచక్రవాహనంపైన ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

అదుపు తప్పి.. ఒళ్లు గగుర్పొడిచేలా..

మంగళవారం తెల్లవారుజామున 2.10 గంటల ప్రాంతంలో ఎర్రగడ్డ భరత్‌నగర్‌ పైవంతెనపై 30 అడుగుల ఎత్తు నుంచి పల్టీలు కొడుతూ కారు కిందపడి నుజ్జునుజ్జయ్యింది. బాంబు పేలిందేమోనని అక్కడున్న వారంతా భయపడి పారిపోయారంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

  • మరుసటి రోజు మియాపూర్‌ హాఫీజ్‌పేట్‌ పైవంతెన వద్ద మద్యం మత్తులో అతివేగంగా దూసుకొచ్చిన మరో కారు బీభత్సం సృష్టించింది. పైవంతెన ఎక్కాల్సిన కారు అదుపు తప్పి కింద ఓ హోటల్‌ ముందు ద్విచక్రవాహనంపై కూర్చున్న వ్యక్తిని ఢీకొట్టింది.
  • ఒళ్లు గగుర్పొడిచేలా గతేడాది నవంబరు 23న బయోడైవర్సిటీ పైవంతెనపై నుంచి ఫోక్స్‌వ్యాగన్‌ పోలో కారు 50 అడుగుల ఎత్తు నుంచి పల్టీలు కొట్టింది. రోడ్డుపక్కన ఉన్న ఓ మహిళపై పడింది.

జరిమానాలు వేస్తున్నా..

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నా, భారీగా జరిమానాలు వేస్తున్నా, న్యాయస్థానాలు జైలు శిక్ష విధిస్తున్నా మందుబాబులు మాత్రం మారడం లేదు. లిక్కర్‌ కిక్కులోనే కార్ల స్టీరింగ్‌ పడుతున్నారు. రోడ్డెక్కడమే ఆలస్యం.. గాల్లో తేలిపోతున్నారు. ఒక్కసారిగా వేగాన్ని అదుపు చేయలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా సైబరాబాద్‌ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఓ వాహనదారుడిని పరీక్షించగా అతని బీఏసీ 512గా తేలడం గమనార్హం. కర్మాన్‌ఘాట్‌లో ప్రమాదానికి గురైన కారు వేగం గంటకు 140 కి.మీలు ఉందని పోలీసులు గుర్తించారంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

వంతెనలపైనా వేగమే..

పైవంతెనలపై వేగం గంటకు 40 కి.మీలు మించరాదు. భరత్‌నగర్‌, బయో డైవర్సిటీ పైవంతెనపై బీభత్సం సృష్టించిన కార్ల వేగం 100 కి.మీల కంటే ఎక్కువగానే ఉండటం గమనార్హం. మియాపూర్‌ హాఫీజ్‌పేట్‌, బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 3లో ప్రమాదానికి గురైన కార్ల వేగం కూడా 100 కి.మీల వరకు ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారాంతపు తనిఖీలే కాకుండా నిరంతరం డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు, నిర్ణీత వేగాన్ని మించి దూసుకెళ్లే వాహనాలకు ముక్కుతాడు వేసేలా ప్రత్యేక నిఘా వ్యవస్థ తేవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: కారును ఢీకొట్టిన డీసీఎం.. ముగ్గురికి తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.