ETV Bharat / state

డ్రైవర్​కు మూర్చ వచ్చింది.. వాహనం అదుపు తప్పింది... - సికింద్రాబాద్

సికింద్రాబాద్​లో వాహనాల పైకి వింగర్​ వాహనం దూసుకెళ్లిన ఘటన కలకలం సృష్టించింది. దాదాపు 10 వాహనాలను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బేగంపేట్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ ప్రభాకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

car accident
author img

By

Published : Jul 28, 2019, 1:44 PM IST

Updated : Jul 28, 2019, 2:05 PM IST

సికింద్రాబాద్​ బేగంపేట్ ప్రకాష్ నగర్ వద్ద అదుపుతప్పిన వింగర్ వాహనం బీభత్సం సృష్టించింది. డ్రైవర్​కి ఫిట్స్ రావడం వల్ల నియంత్రణ కోల్పోయాడు. వింగర్ ముందున్న వాహనాల పైకి దూసుకెళ్లింది. దాదాపు 10 వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో బేగంపేట్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ ప్రభాకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా...పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ప్రభాకర్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

సికింద్రాబాద్​లో వాహనాల పైకి దూసుకెళ్లిన కారు...

ఇవీ చూడండి:రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డిది కీలక పాత్ర: ఉత్తమ్

Last Updated : Jul 28, 2019, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.